
శ్రీలంకతో జరిగిన గడిచిన 7 టీ20 మ్యాచ్ లలో భారత్ కు ఇది తొలి ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా గౌరవప్రదమైన 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్ 49 బంతుల్లో 90 పరుగులు చేసి బ్యాటింగ్ కు వెన్నమూకగా నిలవడంతో, కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా నమోదు చేయగలిగారు. ధావన్ మినహా ఏ ఇతర బ్యాట్స్ మెన్ కూడా తన బ్యాట్ కు పని చెప్పలేకపోయారు. దీంతో ధావన్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చివరిలో ఆశించిన పరుగులను రాబట్టడంలో టీమిండియా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు.
మరోవైపు కట్టుదిట్టమైన బౌలింగ్ కు తోడు, లక్ష్య చేధనను చాలా గ్రాండ్ గా ఆరంభించారు లంకేయులు. తొలి 5 ఓవర్లలో ఏకంగా 70 పై చిలుకు పరుగులు సాధించి మ్యాచ్ ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. ముఖ్యంగా కుశాల్ పరేరా టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుశాల్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ శ్రీలంక వైపుకు తిరగగా, మధ్యలో ఒకటి, రెండు వికెట్లు సాధించినా టీమిండియాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ లు మినహా బౌలింగ్ డిపార్టుమెంటులో కూడా మూకుమ్మడిగా విఫలమయ్యారు. దీంతో ఈ ముక్కోణపు టోర్నీలో తొలి విజయం నమోదు చేసుకుని, పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్ర స్థానంలో నిలిచింది. టీమిండియా బౌలర్ల పనిపట్టిన కుశాల్ పరేరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చాలాకాలం తర్వాత అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకోవడంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో శ్రీలంక జట్టు ఉంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…