Telugu

ఇంటర్నేషనల్ మ్యాచ్ లా… గల్లీ క్రికెటా..?

214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ‘కోబ్రా’ డ్యాన్స్ వేసిన బంగ్లా క్రికెటర్ రహీంపై రివేంజ్ తీర్చుకునేందుకు శ్రీలంక క్రికెటర్లు మాంచి కసిమీద ఉన్నట్లుగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ చెప్తోంది. ఈ మ్యాచ్ ఆద్యంతం శ్రీలంక – బంగ్లా క్రికెటర్ల నడుమ వ్యక్తిగత భావజాలం బాగా వ్యక్తమయ్యింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు వరుసగా వికెట్లు కోల్పోతూ శ్రీలంక విన్నింగ్ పొజిషన్ కు వచ్చేసరికి లంక క్రికెటర్లు ‘కోబ్రా’ డ్యాన్స్ తో అవహేళన చేసే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT

అలాగే రహీం ఔటైన సమయంలో ఫ్లూట్ ఊదుతున్నట్లుగా బౌలర్ అపోస్నో ఇచ్చిన ఫోజు గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులనే కాదు, టీవీల ముందు కూర్చున్న వీక్షకులను కూడా అలరించింది. ఇదే ప్రతీకారంతో ఉన్న బంగ్లా క్రికెటర్లకు చివరి ఓవర్లో ఓ అవకాశం వచ్చింది. తొలి రెండు బంతుల్లో ఒక దానిని బౌన్సర్ గా పరిగణించి, రెండవ బంతిని ‘నో’ బాల్ గా ఎంపైర్ ప్రకటించాలని, అలా చేయనందుకు గానూ తమ క్రికెటర్లను గ్రౌండ్ లో నుండి వచ్చేయమని కెప్టెన్ షకీబ్ హాల్ హసన్ పిలుపునిచ్చాడు.

ఆ సమయంలో విజయానికి గానూ 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. అలా దాదాపుగా ఓ ఏడెనిమిది నిముషాల వరకు సాగిన వాదనలో చివరికి షకీబ్ వెనక్కి తగ్గి డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగా, క్రీజులో ఉన్న మహ్మదుల్లా 3 బంతుల్లోనే 12 పరుగులు సాధించి విజయాన్ని సమకూర్చాడు. దీంతో బంగ్లా క్రికెటర్లు రివేంజ్ తీర్చుకునే వంతు వచ్చింది. మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి లంక క్రికెటర్లను చూస్తూ ‘నాగిని’ డ్యాన్స్ లు వేస్తూ అవహేళన చేసే ప్రయత్నం చేసారు.

విషయం ఇక్కడితో ముగిస్తే మజా ఏముంది? మైదానం వీడి వెళ్తున్న సమయంలో కూడా శ్రీలంక క్రికెటర్ కు – బంగ్లా క్రికెటర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. సాధారణంగా గల్లీ క్రికెట్ లో సంభవించే కొట్లాట ఒక్కటే అక్కడ జరగలేదు గానీ, మిగతా అంతా యాజిటిజ్ గా జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ లు ఆడుతూ ఈ విధంగా ప్రవర్తించడం లంక, బంగ్లా క్రికెటర్లకు ఏ మాత్రం తగదు. బహుశా వీటిని పర్యవసానాలు ఐసీసీ మ్యాచ్ ఫీజు కోత రూపంలో ఉంటుందేమో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

2 hours ago

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

6 hours ago