Telugu

సచిన్ ను గుర్తుకు తెచ్చిన టీమిండియా!

శ్రీలంకతో మొదలైన వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 112 పరుగులకు ఆలౌట్ అయ్యి, శ్రీలంక విజయాన్ని సునాయాసం చేసింది. ఒకానొక దశలో 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో కనీసం 50 పరుగులు అయినా చేస్తుందా? లేదా? అనుకున్న తరుణంలో ధోని (65) బ్యాటింగ్ ప్రతిభతో కనీసం 100 పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది.

స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ, తరంగ (49) దూకుడైన బ్యాటింగ్ తో మ్యాచ్ లో పట్టు సాధించింది. విరాట్ కోహ్లి వివాహం నేపధ్యంలో ఈ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్క విరాట్ కోహ్లి లేని జట్టు మరీ ఇంత పేలవమైన ప్రదర్శనను ఇవ్వడంతో, గతంలో సచిన్ లేని సమయంలో టీమిండియా ఏ విధంగా ఆడేదో అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చింది.

ADVERTISEMENT

ఎప్పుడైనా సచిన్ ఒకటి, రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుంటే, ఇదే రకమైన ఆట తీరుతో జట్టు ఓటమి పాలు కావడం, ఆ వెనువెంటనే సచిన్ జట్టులోకి రావడం అనేవి తెలిసినవే. ప్రస్తుతం విరాట్ కోహ్లి లేని టీమిండియా కూడా అదే తరహా ప్రదర్శన ఇస్తోందా? అన్న అనుభూతులను పంచుతోంది. అంతేకదా… క్రీజులోకి దిగిన ప్రతిసారి అభిమానులు సెంచరీలు కోరుకునే సచిన్, కోహ్లిలను వదిలేస్తే… నేడు జట్టంతా కలిసి సెంచరీ చేయడం గగనం అయిపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Hanuman Reveal to be Another Baahubali Moment?

The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…

18 minutes ago

హీరోయిన్ల బొడ్లు బ్లర్ చేయించారట.. ఇదేం చోద్యం

రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…

39 minutes ago