
b,
తన సోషల్ మీడియా పేజ్ లో తాను ఏదైనా రాసుకుంటానని… ‘నీ పేరు మెన్షన్ చేశానా లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా… జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ములా ఈ రోజు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు, నాకేమైనా భయమా? నీవు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?’ అంటూ ప్రశ్నించింది.
సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలకు ఒకటే చెబుతున్నానని… తాను ఒంటరిని అయినప్పటికీ, తనకు కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. పోరాటానికి డబ్బులు అవసరం లేదని, గుండెలో ధైర్యం ఉంటే చాలని తెలిపింది. మీరు తప్పు చేయనప్పుడు సైలెంట్ గా ఉండవచ్చు కదా అని చెప్పింది. తాను కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోబోతున్నానని, త్వరలోనే నోటీసులు అందుతాయని తెలిపింది.
ఇదిలా ఉంటే, శ్రీరెడ్డిపై టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా శ్రీరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ప్రసార మాధ్యమాల్లో ఆమె ఇష్టానుసారం మాట్లాడుతూ టాలీవుడ్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు, దానిని న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు దానిపై చర్యలు తీసుకోనున్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…