
ఎందుకంటే… అభిరామ్ ఉన్న ఫోటోలను స్వయంగా శ్రీరెడ్డి మీడియా వర్గాలకు అందజేసింది. దీంతో ఈ ఫోటోలపై ఎవరికీ సందేహం నెలకొనలేదు. ఇది జరిగిన కొద్దిసేపటికే టాప్ డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి పేరుతో సోషల్ మీడియాలో వాట్సప్ చాట్స్ ప్రత్యక్షం అయ్యాయి. కానీ శ్రీరెడ్డి సోషల్ మీడియా ఎకౌంటు నుండి మాత్రం వెలువడలేదు. శ్రీరెడ్డి ఇస్తోన్న లీకులతో కొందరు కావాలనే ఇలా సృష్టిస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే… చూసేదంతా నిజం కాదేమో అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ‘ఎంతోమంది’ ఉన్నారని శ్రీరెడ్డి చెప్తోన్న మాట వాస్తవమే గానీ, ఆ ‘ఎంతోమంది’ పేర్లు చెప్పకపోవడంతో ఊహాగానాలకు తెరలేపినట్లయ్యింది. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు మాత్రం టాలీవుడ్ ను ఓ కుదుపు కుదుపుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…