
ఆ తరువాత ఆయన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించారు. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం, ఆ తరువాత శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ, చిన్నాన్న సుబ్బరామయ్య, పిన్నిలు అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మలు. వీరంతా తిరుపతిలోని 93-టీకే వీధిలోని ఇంట్లో నివాసముండేవారు. పెద్దకుమారుడు బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించి, తనవెంట తమ్ముడు, చెల్లెళ్లందర్నీ చెన్నై తీసుకెళ్లిపోయారు.
ఆ తరువాత శ్రీదేవి తల్లి మినిహా మిగిలిన వారంతా ఉద్యోగాల్లో స్థిరపడగా, ఆమె మాత్రం సినిమాల్లో నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి సూర్యకళ అనే కుమార్తె జన్మించింది. అనంతరం రంగారావు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో రాజేశ్వరి ఒంటరిదైంది. ఆ క్రమంలో శివకాశి తెలుగు కుటుంబానికి చెందిన, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక బిడ్డ తండ్రి అయ్యప్పన్ రెడ్డిని రాజేశ్వరి వివాహం చేసుకున్నారు.
దీంతో తన కుమార్తె సూర్యకళను ఆమె తన తల్లిదండ్రులకు అప్పగించింది. వారి దాంపత్యానికి గుర్తుగా శ్రీదేవి, శ్రీలత పుట్టారు. శ్రీదేవి తండ్రి మరణానంతరం ఆయన కుమారుడే కుటుంబ బాధ్యతలు మోశాడు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందినా, ఆమె అన్న మాటను జవదాటేవారు కాదు. శ్రీలతకు మధురైకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ తో వివాహం జరిపించారు. శ్రీదేవి అక్క సూర్యకళను రాజేశ్వరమ్మ మేనత్త కుటుంబంలోని బంధువుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ సూర్యకళ కుమార్తే గులాబీ సినిమా హీరోయిన్ ‘మహేశ్వరి’. అలా శ్రీదేవి తమిళనాడు శివకాశిలో జన్మించినప్పటికీ… అచ్చతెనుగు ఆడబడుచేనని తెలుస్తోంది.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…