
Srikakulam Mayor Poll: Alliance in Focus
నేడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు శ్రీకాకుళం మేయర్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గుండా లక్ష్మీదేవి టీడీపీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆమె భర్త మాజీ మంత్రి స్వర్గీయ గుండా అప్పల సూర్యనారాయణ కాలం నుంచే వారి కుటుంబానికి శ్రీకాకుళంపై మంచి పట్టుంది. ముఖ్యంగా వైశ్య, యాదవ, శ్రీశయన సామాజికవర్గాలతో ఆమెకు సత్సంబంధాలున్నాయి.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఈ సామాజిక సమీకరణాలతో పాటు జిల్లాలో సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆమెను గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారు.
కనుక కూటమి ఆమెను ఢీకొని ఓడించగల బలమైన నేతను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉండగా, జనసేన పార్టీతో రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన దానేటి రాధారాణిని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి చాలా బలం ఉంది. ముఖ్యంగా దశాబ్దాలుగా కింజరాపు కుటుంబానికి మంచి పట్టుంది. జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉండగా, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఇంత బలమైన నేతలు, క్యాడర్ ఉన్నప్పుడు సీట్ల సర్దుబాట్లలో భాగంగా శ్రీకాకుళంలో పెద్దగా బలం లేని జనసేనకు అప్పగించడం, ఆ పార్టీ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన దానేటి రాధారాణిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మిత్రధర్మం పాటిస్తూ మంత్రులు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఆమెను గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. వారి కృషితో టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయితే ఆమె విజయం సాధించగలరు. లేకుంటే కష్టమే.
కనుక ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే ఆ క్రెడిట్ పూర్తిగా వారిద్దరికీ, టీడీపీకే దక్కుతుంది. కానీ ఓడిపోతే జనసేనకు ఆ సీటు కేటాయించడం, అభ్యర్థిగా ఆమె ఎంపిక రెండూ తప్పేనని రుజువు అవుతుంది.
ముఖ్యంగా టీడీపీ అవలీలగా గెలుచుకోగల ఈ సీటును చేజేతులా వైసీపీకి అప్పగించినట్లవుతుంది కూడా. శ్రీకాకుళం మేయర్ పదవి ఎవరికీ దక్కుతుందో తెలియాలంటే ఈ నెల 30న ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు మొదటి దశలో 3,240 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల…
When it was first announced that Dhanush was working on a film called Om, there…