
ఈ రోజు ప్రొద్దుట నుండి బెంగళూర్ ఒక రీసెట్ లా జరిగిన రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులు, సినీ సెలబ్రేటిస్ పాల్గొన్నట్టు, ఆ పట్టుబడిన వారిలో వీరు కూడా ఉన్నారంటూ అటు సోషల్ మీడియాలోను, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా సాగుతుంది.
అయితే ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ సెలబ్రేటిస్ అయిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉన్నారంటూ వార్తలు రావడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మీడియా ముందుకొచ్చారు హేమ, శ్రీకాంత్. నేను మీరు ప్రచారం చేస్తున్నట్లుగా బెంగళూర్ రేవ్ పార్టీలో లేను, ఇక్కడే హైద్రాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అంటూ హేమ మీడియాకు ఒక వీడియో బైట్ ను విడుదల చేసారు.
అయితే తన పై జరుగుతున్న ప్రచారానికి కూడా శ్రీకాంత్ ఇదే తరహాలో జవాబిచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నానంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని, తానూ హైద్రాబాద్ లోనే ఉన్నట్లు ప్రకటించారు హీరో శ్రీకాంత్. ఇప్పటికే తనకు తన భార్య ఊహకు మధ్య మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడాకులు తీసుకున్నాం అంటూ మీడియాలో ప్రచారం చేసి ఒకసారి తప్పుచేసిన వారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎటువంటి రుజువులు లేకుండా ఇలా రేవ్ పార్టీలో దొరికిన తెలుగు హీరో అంటూ నా పేరును ప్రచారం చేయడం మంచికాదని, తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చేసారు శ్రీకాంత్.
అయితే ఈ రేవ్ పార్టీలో సినీ సెలబ్రేటిస్ తో పాటుగా మరికొందరి ప్రముఖుల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ వారి పేర్లు బయటకు రాకపోవడంతో వారెవరనేది స్పష్టత లేకపోయింది. రేవ్ పార్టీలలో పట్టుబడిన వారితో పాటుగా అక్కడ అధిక సంఖ్యలో మద్యం, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Air India has taken another step in its ongoing transformation by revealing the upgraded interiors…
Yash Raj Films and Red Chillies Entertainment, backed by Shah Rukh Khan, are reportedly exploring…