
ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర సినీ విశేషాలు చెప్పుకొచ్చిన అవసరాల… “తన మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా విడుదలయ్యేటప్పుడు సినిమా గురించి 1% కూడా డౌట్ లేదని, అయితే తన రెండవ సినిమా ‘జ్యో అచ్యుతానంద’ విడుదలకు సిద్ధమవుతున్నపుడు హిట్ అవుతుందని 1% నమ్మకం కూడా లేదని, ఈ సినిమాను చూసిన ప్రతి వారు బాగోలేదని చెప్పారని, తన డైరక్షన్ డిపార్టుమెంటు నుండి ఆప్తుల వరకు ఎవరికీ నమ్మకం లేదని” చెప్పి షాక్ కు గురిచేసారు.
చివరికి నాకు కూడా స్క్రిప్ట్ లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించానని, దీంతో తానూ కూడా నమ్మకం కోల్పోయానని, నిర్మాత కూడా ఓ వినూత్నమైన సినిమా చేస్తున్నామని అనుకున్నారే గానీ, హిట్ అవుతుందని అనుకోలేదని… అయితే సినిమాలో ఉన్న లోపాలను పక్కన పెట్టి, ప్రేక్షకులు అందించిన తీర్పుకు మిక్కిలి సంతోషంగా ఉందని, నిర్మాతకు అంతకు ముందు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో, ఈ సినిమా విజయం తప్పనిసరిగా మారిన వేళ, మంచి రెవిన్యూ వస్తోందని… ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాకు కొనుగోలు చేస్తున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్లకు కూడా నమ్మకం లేక, సినిమా చూసీ మరీ కొనుగోలు చేసారని, అయితే సినిమాను చూసిన తర్వాత కూడా ఎలా కొనుగోలు చేసారని? మేమంతా అనుకున్నామని అవసరాల నవ్వుతూ చెప్పినా… దాని వెనుక ఉన్న ఆవేదన స్పష్టంగా కనపడుతోంది. సినిమాలో నాని అతిథి పాత్ర ముందుగా అనుకున్నది కాదు గానీ, చివరికి హీరోయిన్ కు జోడి ఎవరైనా ఉంటే బాగుంటుదన్న కమర్షియల్ కోణంలో నానిని చేర్చామని అవసరాల అన్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…