జవాన్: అదీ తెలుగువారంటే… తమిళంకంటే తెలుగే!!!

Jawan-Movie-Controversyతెలుగు వారి సినిమా అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా బాగుంటే చాలు ఆ సినిమా భాషతో పనిలేదు. అది డబ్బింగ్ ఆ, రీమేక్ ఆ అన్న పట్టింపు లేదు. హీరో పేరున్న వాడా? కొత్తవాడా? అసలు హీరో ఉన్నాడా లేదా అన్న సంశయం కూడా లేదు. సినిమా బాగుండాలి అంతే, ఆదరించేస్తారు, ఎటువంటి మొహమాటం లేకుండా. దీనికి లెక్కకు మిక్కిలి ఉదాహరణలు ఉన్నాయి. లేటెస్ట్ ఉదాహరణ కావాలంటే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి.

షారుఖ్ ఖాన్ అంటే నేషన్ వైడ్ గుర్తింపు ఉన్న స్టార్. అయితే నార్త్ సినిమాలు సౌత్ లో భారీ లెవెల్లో హిట్ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది. షారుఖ్ లాస్ట్ సినిమా పఠాన్ సౌత్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సింహభాగం కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండే వచ్చాయన్న విషయం తెల్సిందే.

ADVERTISEMENT

ఇప్పుడు జవాన్ విషయంలో కూడా అదే జరిగింది. జవాన్ కు అట్లీ దర్శకుడు… ఆయన తెలుగు వాడు. విజయ్ సేతుపతి, నయనతార ప్రముఖ పాత్రల్లో నటించారు, వారూ తమిళ వారే. ఇక ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అనిరుధ్ తో మొదలుపెట్టి చాలా మంది తమిళ వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఈ చిత్రానికి తమిళంలో కంటే తెలుగులో భారీ వసూళ్లు రావడం గమనార్హం.

తెలుగులో స్టార్ హీరోకి వచ్చే రేంజ్ లోనే జవాన్ కు కూడా కలెక్షన్స్ రావడం చూస్తుంటే తెలుగు ప్రజలకు సినిమా అంటే ఎలాంటి అభిమానం ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ తెలుగు సినిమా అభిమానులు ఆర్ ది బెస్ట్.

ADVERTISEMENT
Latest Stories