Telugu

ఫ్యామిలీ…ఫ్యామిలీ మొత్తం ‘కొత్తగా’ ట్రై చేస్తున్నారుగా…

సహజంగా మన తెలుగు ఇండస్ట్రీ అనే కాదు కానీ, దాదాపుగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో వారసుల హంగామా ఉంటుంది. హీరో నుంచి సైడ్ పాత్రలు వేసే వాళ్ళ వారసుల వరకూ ఈ హంగామా షరా మామూలే, అయితే ఇక్కడ మనం చదివే మ్యాటర్ కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి.

[m9ad]

ADVERTISEMENT

సహజంగా తమ పెద్దలను ఆధారంగా చేసుకుని ఎదగాలి అనుకుంటున్నారు ఇండస్ట్రీలో వాళ్ళ వారసులు, కానీ రాజమౌళి మరియు కీరవాణి ఫామిలీ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం అనే చెప్పాలి.. ఆ మధ్య ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పారు, కీరవాణి గారి కుమారుడు ఆయన పేరు చెప్పకుండా అవకాశాల కోసం తన చుట్టూ తిరిగాడు అని. ఆ సింప్లిసిటీ కి హాట్స్ ఆఫ్.

ఇక ఈ కధ అంతా పక్కన పెట్టేస్తే. ‘ఆకాశవాణి’ అంటూ ఇటు రాజమౌళి, అటు కీరవాణి ఫ్యామిలీ…ఫ్యామిలీ మొత్తం కొత్త సినిమాతో సరికొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న జక్కన్న రాజమౌళి చేతుల మీదగా విడుదల చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో రాజమౌళి కుమారుడు కార్తికేయ తొలిసారిగా నిర్మాతగా మారగా, ఇక ఇదే సినిమాతో కీరవాణి కుమారుడు కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆరంగేట్రం చేస్తున్నాడు. మరో పక్క ఈ సినిమాకి జక్కన్న అసిస్టెంట్ అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక యధావిధిగా మాటలను మన సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ ‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్ మంచి ఫీల్ తో కూడుకుంది. మరి తమ కాళ్లపై తాము నిలబడాలి అని ఈ విజేతల వారసులు చేస్తున్న ఈ ప్రయత్నం వారికి మంచి ఫలితాన్ని అందిస్తుంది అని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sita Controversy: Nayanthara Praised, Sai Pallavi Slammed

Old-generation music director Saluri Vasu Rao has slammed Sai Pallavi’s casting as Sita in Ramayana,…

35 minutes ago

ఈ సంయుక్త సమావేశం చాలా అవసరమే!

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు…

37 minutes ago