Telugu

యాసిడ్ టెస్ట్ ఫర్ కార్తికేయ

ఎస్.ఎస్.కార్తికేయ అనే పేరు తెలియనివారుండరు. రాజమౌళి కొడుకుగా మాత్రమే కాక.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలని ఎగ్జిక్యూట్ చేసిన అసోసియేట్ డైరెక్టర్ గానూ అందరికీ సుపరిచితుడు కార్తికేయ.

అయితే.. రాజమౌళి దర్శకదిగ్గజంగా పేరు గాంచినా కూడా, కార్తికేయ మాత్రం ఎందుకో దర్శకత్వంవైపు మొగ్గు చూపకుండా, ఎగ్జిక్యూషన్ కే పరిమితం అయిపోయాడు. అది అతని పర్సనల్ ఛాయిస్ అనుకోండి.

ADVERTISEMENT

ఎగ్జిక్యూటివ్ గా ఇదివరకు కూడా “ఆకాశవాణి”అనే సినిమాతో సపరేట్ గా తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నం చేసాడు. కానీ ఆ సినిమా నుండి సగంలో బయటికి వచ్చేశాడు. దాంతో.. “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” అనేది కార్తికేయ ఫస్ట్ అవుటింగ్ గా మారింది.

ఫహాద్ ఫాజిల్ లాంటి అత్యుత్తమ నటుడ్ని హీరోగా సెట్ చేయడం మొదలుకొని.. ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలుచుకురావడం, సినిమాకి డీసెంట్ హైప్ బిల్డ్ చేయడం వరకు సక్సెస్ అయ్యాడు కార్తికేయ.

ఇకపోతే.. రాజమౌళి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కార్తికేయ మీద పడింది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ విషయంలో మాత్రమే కాదు, నిర్మాతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం కార్తికేయ కచ్చితంగా పెద్ద హిట్ కొట్టి తీరాలి.

మరి కార్తికేయ తన సత్తాను “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” సినిమాతో ప్రూవ్ చేసుకుంటాడో లేదో అనేది ఇంకొక్క రోజులో తెలిసిపోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Don’t Trouble The Trouble: Only Two Spoke About Balakrishna

There was one noticeable omission at the Don’t Trouble The Trouble pre-release event. Balakrishna’s name…

36 minutes ago

ODI 2027 WC: Which Teams Miss Out? Who Qualifies Directly?

The ODI World Cup 2027 will have 14 teams, with 10 teams getting direct qualification…

1 hour ago