
బాహుబలి సినిమా విడుదలైన నాటి నుండి తెలుగు సినిమా స్థాయి అంచలంచలుగా టాలీవుడ్ నుండి పాన్ ఇండియా అక్కడి నుంచి…RRR సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది అనడంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
టాలీవుడ్ ఈ స్థాయికి చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించినది దర్శకధీరుడు రాజమోళి అనే చెప్పాలి. బాహుబలితో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన జక్కన్న, RRR తో రాంచరణ్ ,జూ.ఎన్టీఆర్ ను అదే స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు వచ్చింది.
త్వరలో తెరకెక్కబోతున్న మహేష్ – రాజమౌళి సినిమా కోసం ఇప్పటికే మహేష్ మేక్ఓవర్ లో మార్పు కనపడుతుంది. గుంటూరు కారంలో మహేష్ నయా లుక్స్ అందులో భాగమే అప్పుడే
“జక్కన్న మహేష్ ను చెక్కడం మొదలుపెట్టారు” అంటూ ప్రిన్స్ అభిమానులు సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి – మహేష్ కాంబో సినిమా కథ రెడీ అయ్యిందంటూ, రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
అయితే గుంటూరు కారం టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం రికార్డులను తిరగరాస్తోందని చిత్ర నిర్మాత నాగ వంశీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పారు అనడం కన్నా హెచ్చరించారు అంటే కరెక్ట్ గా ఉంటుందేమో మరి. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టుకోవడంతో మహేష్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో మరోసారి నిరూపించబడింది.
అయితే సినిమా విడుదల తరువాత ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసే మహేష్ ఇప్పుడు సోలో గా జర్మనీ వెళుతున్నారని సమాచారం. నమ్రత హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ కు సెండ్ ఆఫ్ ఇచ్చి వెనక్కి వెళ్లిపోయారు. దీనితో రాజమౌళి సినిమా మేక్ఓవర్ కోసమే మహేష్ జర్మనీ వెళ్లిఉండొచ్చని, గతంలో కూడా ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ ఇదేతరహా లో సినిమా ప్రారంభించడానికి ముందు విదేశాలకు వెళ్లారని ఇప్పుడు మహేష్ కూడా అదే పనిలో భాగంగా జర్మనీ వెళ్ళారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమాతో తెలుగు సినిమాను, సూపర్ స్టార్ మహేష్ బాబుని ఏ స్థాయిలో నిలబెడతారో అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు మహేష్ అభిమానులు కూడా మరో రెండు …మూడేళ్లు వేచి చూడక తప్పని పరిస్థితి. “వైటింగ్ కష్టంగా ఉన్నా రిజల్ట్ మాత్రం గట్టిగా ఉంటుందని” ఇప్పటికే జక్కన్న చాలాసార్లు వారి అభిమాన హీరోల ఫాన్స్ కు రుజువుచేసారు.
The Andhra Pradesh High Court raised serious questions over the criminal complaint filed against Pawan…
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ సమయంలో అందరూ వాటికి బదులు…