
దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై మొదటి మీటింగ్ ఇటీవలే కేరళలో జరిగిన సంగతి తెలిసిందే. రెండో మీటింగ్ అమరావతిలో జరగబోతుంది. మే 7న అమరావతిలో దక్షినాది రాష్ట్రాలే కాదు, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలు కూడా వస్తున్నాయి. ఈ మీటింగు ఎలా అయినా జరగకూడదని మోడీ ప్రభుత్వం అభిలాష.
మోడీ రాష్ట్రాల పై చూపిస్తున్న వివక్షకు ఒక వేదిక ఏర్పాటవుతుంది దీని వల్ల ఆ పార్టీ అవకాశాలు కర్ణాటకలో దెబ్బతినే అవకాశం ఉంది గనుక ఇటువంటి ప్రయత్నాలు దేశ సమగ్రతకు చేటు అని గవర్నర్ తో రాయబారం చేశారట. అంతకు ముందు కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ జైన్ ను కూడా అమరావతి పంపారు. అయితే ఈ సమావేశం యధాతధంగా జరగబోతున్నట్టు సమాచారం.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…