Telugu

హార్రర్ స్టోరీ – నటుడు సుబ్బరాజు ‘బెడ్’ క్రింద ఏం ఉంది?

హీరో ఫిజిక్ కలిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్న నటుడు సుబ్బరాజు గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. “పోకిరి” సినిమా తర్వాత టాలీవుడ్ లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుబ్బరాజు, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. సాధారణంగా హార్రర్ కధలను వెండితెరపైనే చూస్తుంటాం గానీ, సుబ్బరాజు మాత్రం నిజంగా చవిచూసినట్లుగా అర్ధమవుతోంది. మరి ఆ కధేంటో సుబ్బరాజు మాటల్లోనే…

“తన అపార్ట్ మెంట్ లో తను తప్ప ఎవరూ ఉండరని, ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో ఫ్లాట్ కు వచ్చి ఫ్రెష్ అయ్యి, తన ల్యాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుండగా, తన బెడ్ పక్కనుండి ఒక మనిషి తలకాయ అలా పైకి వచ్చి క్రిందకి వెళ్లిందని, అయితే ఇది తన భ్రమ ఏమో అనుకుని, కాసేపటికి తేరుకుని మళ్ళీ వర్క్ చేసుకుంటుండగా… మళ్ళీ అలాగే తలకాయ వచ్చి వెళ్ళేపాటికి తనకు డౌట్ వచ్చిందని, అయితే తన ఇంట్లోకి ఎవరు వచ్చుంటారా?” అని ఆలోచిస్తుంటే…

ADVERTISEMENT

“దొంగలు వచ్చే అవకాశం లేదు, ఉన్న రెండు తాళాలలో ఒకటి నా దగ్గర ఉంటుంది, మరొకటి లోన బీరువాలో ఉంటుంది. ఒకవేళ దొంగలు వచ్చినా నేను వచ్చిన సౌండ్ విని పారిపోయి ఉండాలి కదా అనుకుని, నెమ్మదిగా బెడ్ పైకి వెళ్లి క్రిందకు చూసాను, అక్కడ ఏమీ కనపడలేదు. దీంతో ఒక్కసారిగా కిందకి దూకి, డోర్ తీసి బయటకు వెళ్లి, డోర్ క్లోజ్ చేశాను. అయితే లోన ఏం జరుగుతుందా? అని తలుపుకు, నేలకు మధ్య ఉన్న గ్యాప్ లోంచి తొంగిచూసాను” అంతే..!

మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్ది గంటలు గడవాల్సిందే. అయితే సుబ్బరాజు చెప్పిన తీరు చూస్తుంటే… ఏదో ఓ హార్రర్ కధ చెప్తున్నట్లుగా కనపడుతోంది. మరి చివరికి ఈ కధ క్లైమాక్స్ ని తెలుగు సినిమా మాదిరి కామెడీగా ముగిస్తారో, హాలీవుడ్ మాదిరి భయంకరంగా ముగిస్తారో చూడాలి. ఈ వీడియోను చూసి ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు?’ మాదిరి ‘సుబ్బరాజు బెడ్ కింద ఏం ఉంది?’ పజిల్ విప్పండి అని కోరుతున్నారు. అయితే ‘బాహుబలి’ మాదిరి అని రోజులు వేచిచూడాల్సిన పనిలేదు. శుక్రవారం నాడు ఈ సస్పెన్స్ వీడిపోనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramba Oorvasi Menaka Review: Tiresome Return to Outdated Cinema

BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…

17 minutes ago

Konda Surekha @ YCP: Only A Dream?

Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…

19 minutes ago