
దీంతో ఇటీవల సుచిత్ర కిడ్నాప్ కు గురయ్యిందని, దీని వెనుక కోలీవుడ్ ప్రముఖులు కొందరు ఉన్నారని పుకార్లు షికారు చేసాయి. కానీ, తాజాగా సుచిత్ర భర్త కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సుచిత్ర ప్రత్యక్షం కావడంతో, కిడ్నాప్ కు గురి కాలేదన్న విషయంపై స్పష్టత వచ్చినట్లయ్యింది. ‘తాను కొత్త కామెడీ స్పెషల్ ను రాస్తున్నట్లు, దీనిని 2017 సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నట్లుగా చెప్పిక కార్తీక్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో సుచిత్ర పుస్తకం చదువుతూ కనిపించడంతో సుచిత్ర ట్విస్ట్ వీడినట్లయ్యింది.
ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉంటున్నారని, అంతకుముందు కార్తీక్ చెప్పినట్లుగా వైద్యం నిమిత్తం సుచిత్ర అక్కడే ఉందని, అలాగే విడాకులంటూ చెప్పిన విషయం కూడా ప్రస్తుతం సర్దుమణిగిందని, ఈ చిన్న వీడియో ద్వారా స్పష్టమైంది. దీంతో సుచిత్ర వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే భావించవచ్చు. అయితే సంచలనం సృష్టించిన “సుచిలీక్స్” గురించి ఎదురుచూసిన నెటిజన్లకు మాత్రం నిరుత్సాహం తప్పేలా లేదు. మొత్తానికి ఇక ‘సుచిలీక్స్’కు శుభంకార్డు పడినట్లే డిక్లేర్ చేయవచ్చు.
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…