
సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కావడం, ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు అమెరికా వెళ్ళిందనే ప్రచారం జరిగింది. దీనికి తోడు సుచిత్ర మానసిక స్థితి సరిగా లేదని భర్త కార్తీక్ అనడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సుచిత్ర తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు చెప్పడం… ఇలా ఏ ఒక్క దానికి మరొక అంశంతో సంబంధం లేనిదిగా మారిపోయింది. దీనికి ‘సుచిలీక్స్’ పేరుతో బట్టబయలు అయిన సెలబ్రిటీలు ధనుష్, అనిరుధ్, రానా, ఆండ్రియా, హన్సిక, త్రిష, చిన్మయి వంటి వారు డైరెక్ట్ కామెంట్లు కాకపోయినా, పరోక్షంగా కామెంట్లు చేసి సైలెంట్ గా ఉండడం జరిగిపోయింది.
అయితే తాజాగా కోలీవుడ్ లో సుచిత్ర గురించి ఓ సంచలన సమాచారం చక్కర్లు కొడుతోంది. టాప్ హీరో హీరోయిన్లతో పెట్టుకున్న ‘సుచిలీక్స్’ సుచిత్ర కిడ్నాప్ కు గురయ్యిందని, దీని వెనుక చాలా పెద్ద తలకాయలే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే సుచిత్ర మీడియా ముందుకు వచ్చి పెదవి విప్పాల్సిందే. నిజంగా కిడ్నాప్ కు గురయితే సుచిత్రకు ఆ అవకాశం లభిస్తుందా? ఒకవేళ లభించినా నిజాలు బయటకు చెప్పగలుగుతుందా? అనేది కీలకంగా మారింది. అయితే ఈ కిడ్నాప్ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో గానీ, సుచిత్ర లీక్ చేసిన వ్యవహారాలన్నీ నిజమేనన్న భావన అయితే ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…