Telugu

అవేం పిచ్చి కథలు సుహాస్?

సాధారణంగా హీరోయిన్లు సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్ళాక.. తల్లి రొమ్ము కాళ్లతో తన్నినట్లుగా “అక్కడ అమ్మాయిలకి వేల్యూ ఉండదు, నడుముల మీదే ఫోకస్ ఉంటుంది, చాలా చీప్ గా చూస్తారు” అంటూ రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి.. సౌత్ ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తుంటారు. అందులో తాప్సీ టాప్ లో ఉంటుంది.

అయితే.. ఒక హీరో ఇలా తనను సాకిన ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది మాత్రం ఎప్పుడూ చూడలేదు అనుకుంటుంటే.. ఆ లోటు తీర్చేశాడు సుహాస్. రీసెంట్ గా చెన్నైలో జరిగిన “మండాడి” సక్సెస్ మీట్ లో ఆ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. “కలర్ తక్కువగా ఉన్నాడని తెలుగు ఇండస్ట్రీలో తక్కువ చేసేవారు, కామెంట్లు చేసేవారు, కానీ తమిళనాట మాత్రం సుహాస్ కలర్ అంటే ఇష్టపడతారు. ఇక్కడ స్టార్ యాక్టర్ గా ఎదుగుతాడు” అని కామెంట్ చేశాడు.

ADVERTISEMENT

దానికి స్టేజ్ కింద కూర్చున్న సుహాస్ కూడా అవును అన్నట్లుగా తల ఊపుతూ నవ్వడం అనేది హాస్యాస్పదం. సుహాస్ ఛాయ్ బిస్కెట్ షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పటినుండి నటుడిగా అతడ్ని ఎంకరేజ్ చేశారు తెలుగు ఆడియన్స్ & ఫిలిం మేకర్స్. నేచురల్ స్టార్ నాని అయితే.. సుహాస్ టాలెంట్ కి ముగ్ధుడయ్యి అతడి ప్రతి సినిమాని ప్రమోట్ చేసేవాడు.

కలర్ ఫోటోకి క్యారెక్టర్ రోల్స్ చేసిన సుహాస్, అనంతరం హీరో అయ్యాక ఆరేడు సినిమాలు సైన్ చేశాడు. వాటిలో డబ్బుల కోసం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాల్ని కనీసం రిలీజ్ టైంలో ప్రమోట్ కూడా చేయలేదు. అయినా సుహాస్ ను పెద్దగా ప్రశ్నించలేదు ఎవరూ. ఒకానొక టైంలో తన రెమ్యునరేషన్ పెంచాడు అని ప్రశ్నిస్తే.. “ఇదే ప్రశ్న పెద్ద హీరోలని అడగలేరు కదా, నేను దొరికాను కాబట్టి నన్ను అడుగుతున్నారు” అని మీడియాకి సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా తెలుగులో హీరోగా బోలెడన్ని సినిమాలు చేసి, రెమ్యూనరేష్ మరియు ఓటీటీ రైట్స్ లో షేర్ అంటూ బాగా డబ్బులు సంపాదించుకున్న సుహాస్, ఇప్పుడు తమిళనాట “తెలుగులో నేను రేసిజం ఫేస్ చేసాను” అంటూ అక్కడి దర్శకనిర్మాతలకు చెప్పుకోవడం అనేది చీప్ పబ్లిసిటీ స్టంట్. అతడి సెలక్షన్ బాలేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ.. కంటెంట్ బాగుంటే తమిళ డబ్బింగ్ సినిమాలు చూస్తున్న ప్రేక్షకులని, టాలెంట్ & క్రేజ్ ఉంటే ఎవర్నైనా హీరోగా పెట్టి సినిమాలు తీసే దర్శకనిర్మాతలని కించపరచడం తప్ప సుహాస్ కి ఒరిగేది ఏమీ లేదు.

సుహాస్ కంటే ముందే తమిళనాట విలన్ గా వరుస సినిమాలు చేయడం మొదలెట్టిన సునీల్ కూడా ఎప్పుడూ ఈ విధంగా కామెంట్ చేయలేదు. మరి సుహాస్ ఇలా కల్లబొల్లి కథలు చెప్పుకుని తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం వల్ల తమిళనాట ఏం సాధిస్తాడో, ఎంత సాధిస్తాడో చూడాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Suhas Colour Comment: Mandaadi Director Faces Questions

Mandaadi director Mathimaran's comments about Suhas and colour discrimination have triggered a debate among Telugu…

49 minutes ago

Nani’s Paradise Rs. 200 Cr Test: Is Day 1 Hype Enough?

The release of Nani-Srikanth Odela’s The Paradise is now just a week away. The censor…

1 hour ago