
లీగ్ లో భాగంగా ఆక్సియమ్ – లాల్మాటియా క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా లాల్మాటియా జట్టు ఓపెనింగ్ బౌలర్ సుజన్ మహ్మద్ బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదైంది. తొలి ఓవర్‌లో బౌలింగ్ చేసిన మహ్మద్, మొత్తం 15 నో బాల్స్ వేశాడు. అలాగే ఈ క్రమంలోనే మరో 13 వైడ్లు వేయగా ఆ బంతులన్నీ బౌండరీలు దాటాయి. ఇక నాలుగు బాల్స్ లో 12 పరుగులు ఇచ్చుకున్నాడు.
మొత్తం 80 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో 4 బంతులకే మొత్తం 92 పరుగులు వచ్చాయి. మొదట బ్యాటింగ్ చేసిన లాల్మాటియా జట్టు 14 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ కాగా, తొలి ఓవర్ మొదటి నాలుగు బంతులకే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. అయితే లాల్మాటియా క్లబ్ జనరల్ సెక్రటరీ అదనన్ రెహమాన్ ఈ విషయంపై మాట్లాడుతూ…
తాము కావాలనే ఇలా చేశామని, ఈ మ్యాచ్ లో టాస్ ఎవరు గెలిచారో కూడా తమ కెప్టెన్ ను అంపైర్లు చూడనివ్వలేదని, అసహనంతో 4 బంతుల్లోనే మ్యాచ్ ను ముగించేశామని సమర్ధించుకున్నారు. ఏది ఏమైనా క్రికెట్ చరిత్రలో ఇంత చెత్త రికార్డు మాత్రం మరోసారి నమోదు కాదని, క్రీడా విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కనీసం ఊహకు కూడా అందని రికార్డు సదరు బౌలర్ వంతయ్యింది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…