
‘నా ఈగో హర్ట్ అయ్యింది… బన్నీతో నేను చేయను…’ అంటూ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. అయితే అంతకుముందు ఓ చిన్న కధ కూడా చెప్పుకొచ్చారులేండి! ‘ఆర్య’ సినిమా షూటింగ్ ఓ పడవలో జరుగుతున్నపుడు, హీరోయిన్ పడవలో నుండి జంప్ చేసి పక్కకు వెళ్ళగా, అందులో ఉన్న నేను నీళ్ళల్లో పడిపోయాను, ఈత రాని తనకు ఇక చివరి క్షణాలు వచ్చేసాయని అర్ధమైపోయింది… ఆ సమయంలో బన్నీ ఒక్కసారిగా నీళ్ళల్లోకి దూకి తనను రక్షించాడు అంటూ చెప్పుకొచ్చారు సుక్కూ.
అయితే ఈ సమయంలో తనకు ఈత రాని కారణంగా తనను రక్షించాలని దూకిన బన్నీ కాళ్ళను పట్టుకుని లాగేసానని, ఏదైనా జరిగితే తనతో పాటు బన్నీ కూడా పోయుండేవాడని, కానీ అప్పటికి కూడా బన్నీ తనను రక్షించాడని, బయటకు వచ్చిన తర్వాత ‘థాంక్స్’ చెప్తే, నీ ‘థాంక్స్’ నాకు వద్దు గానీ, నాకు 7 సినిమా కధలు ఇవ్వు చాలు, నువ్వు డైరెక్షన్ చేయొద్దు స్టోరీలు ఇవ్వు అన్నాడని, దీంతో తన ఈగో హర్ట్ అయ్యిందని, అసలు విషయాన్ని సుక్కూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు.
నిజానికి తన వలనే బన్నీ హీరో అయ్యాడని, నేను అలా నీళ్ళల్లోకి పడకపోయి ఉంటే, బన్నీ రియల్ లైఫ్ హీరో అయ్యుండే వారు కాదని, కనుక నా జీవితానికి ఎప్పుడూ రియల్ లైఫ్ హీరో బన్నీనే అని చెప్పిన సుకుమార్ మాటలకు బన్నీ ఫ్యాన్స్ ‘ఫిదా’ అయ్యారు. ఇక ‘ఆర్య 3’ విషయానికి వస్తే, ఆ సినిమా కాదు గానీ, ప్రతిసారి ఏదొక సినిమా తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఓ డిఫరెంట్ సినిమా బన్నీతో తీయాలని ఉందని, అలా కుదిరినపుడు ఖచ్చితంగా మేమిద్దరం చేస్తామని ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు సుక్కూ.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…