
‘రంగస్థలం’ రిజల్ట్ తర్వాత మెగా కాంపౌండ్ మరోసారి సుకుమార్ ని లాక్ చేసారని, తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలన్న ప్రతిపాదనలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలలో టాక్ ఊపందుకుంది. మరోవైపు ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ‘దీంతో మీ నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ యేనా?’ అని అడిగిన మీడియా వర్గాలకు, ‘అలాంటిదేమీ లేదన్న’ జవాబు ఈ క్రియేటివ్ దర్శకుడు నుండి వచ్చింది.
తన దగ్గర ఓ రెండు, మూడు కధలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పిన సుకుమార్, వాటికి తగిన విధంగా హీరోల ఎంపిక ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్నామని, సంవత్సరమంతా పడ్డ కష్టానికి వచ్చిన ఫలితంతో సంతోషంగా ఉన్నామని, ఫ్యామిలీతో ముఖ్యంగా న పిల్లలతో గడపడం నాకు ఇష్టమని చెప్పిన సుకుమార్, తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టడానికి మరికొంత సమయం ఉందని అన్నారు.
Shah Rukh Khan’s King is arriving on December 24 this year. It marks the reunion…
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…