
[m9ad]
“1 నేనొక్కడినే” కాంబో మళ్ళీ రిపీట్ అవుతున్నందుకు ప్రిన్స్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండడంతో, మరో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా స్టోరీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, ప్రస్తుతం ఈ కాంబోపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ప్రచారం కూడా జరుగుతోంది.
‘రంగస్థలం’ రిజల్ట్ తర్వాత సుకుమార్ ఏం చెప్పినా సెట్స్ పైకి వెళ్ళడానికి బోలెడు మంది రెడీగా ఉంటే, సుకుమార్ మాత్రం మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారు. ఇటీవల ఓ పీరియాడిక్ స్టోరీ చెప్పగా, అందుకు మహేష్ ఒప్పుకోలేదని, దీంతో మరో స్క్రిప్ట్ పై సుకుమార్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే “మహర్షి” ముగిసే లోపున ఈ స్క్రిప్ట్ తుది దశకు చేరుకుంటే పర్లేదు గానీ, లేదంటే సుకుమార్ తో సినిమా డేంజర్ లో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…
Two distinct character introductions are offering audiences an early look at the world being created…