
సుకుమార్ సినిమాలంటే ‘లాజిక్’ల మయం అన్న విషయం తెలిసిందే. ‘1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ సినిమాలను తన క్రియేటివిటీతో నింపేసిన సుకుమార్, మెగా వారసుడు రామ్ చరణ్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారా అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది. దానికి తగ్గట్లుగానే ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ వీరి కాంభినేషన్ లో రాబోతుందన్న ప్రచారం జరిగింది, దానికి తగిన విధంగానే ఓ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.
అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… రామ్ చరణ్ సినిమా కధ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని దర్శకుడు సుకుమార్ తాజాగా స్పష్టం చేసారు. “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా వేడుకలో పాల్గొన్న సుకుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. అయితే సుకుమార్ మార్క్ మానవతా విలువలతో, హ్యూమన్ ఏమోషన్స్ తో ఈ సబ్జెక్ట్ కూడుకుని ఉంటుందని కూడా చెప్పారు సుకుమార్.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…