
సుకుమార్ అంటేనే కొత్తదనానికి పరాకాష్ట. దీంతో ఈ కాంభినేషన్ పై సినిమా తెరకెక్కుతోంది అంటే… ఏ సబ్జెక్ట్ తో ముందుకెళ్తున్నారోనని అటు మెగా అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆ సంగతులన్నీ బయటకు రావాలంటే మరికొద్ది కాలం గడవాలి గానీ, ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ వచ్చాయి. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ సినిమాలను నిర్మించి ‘హ్యాట్రిక్’ బరిలో నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది.
అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన మీదట నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి దర్శకనిర్మాతలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు తారాగణం ఎంపికలో ఉన్నారు. సుకుమార్ సినిమా అంటే సంగీతం దేవిశ్రీప్రసాద్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో..! ఇక, హీరోయిన్ మరియు ఇతర విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…