
మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రభుత్వ ఖర్చుతో కొలంబో వెళ్ళి వచ్చారు. అక్కడ తన ఫోటో, వార్తలు మీడియాలో రావడం కోసం జాతీయ మీడియాకు డబ్బులిచ్చారు. బిల్ గేట్స్ పర్యటనలో టీలు, సమోసాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హెరిటేజ్ కంపెనీ టిటిడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది… ఇలా ఒకటా రెండా ప్రతీరోజూ ప్రతీ విషయంపై వైసీపీ దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. వాటిని ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది కూడా.
ఆ దుష్ప్రచార జాబితాలో విశాఖలో ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ కూడా ఉంది. దానిపై ఎంత దుష్ప్రచారం చేసిందో ఏపీ ప్రజలందరికీ తెలుసు. వైసీపీ దుష్ప్రచారానికి కూటమి ప్రభుత్వం చెక్ పెడితే విచిత్రం కాదు. కానీ సాక్షాత్ గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ చెక్ పెట్టడమే విశేషం.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, “విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన అతిపెద్ద ఏఐ హబ్ గూగుల్ ఏర్పాటు చేస్తోంది. దీని కోసం అమెరికా నుంచి విశాఖతో పాటు భారత్‌లో పలు ముఖ్య నగరాలను కలుపుతూ సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబిల్ వేయబోతున్నాము,” అంటూ గూగుల్ ఏఐ హబ్ ద్వారా భారత్‌కి ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయో వివరించారు.
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకురావాలి. కానీ వైసీపీ వల్ల కాలేదు. కనుక కూటమి ప్రభుత్వం హయంలో వస్తున్నందుకు సంతోషించాలి. కానీ ఏవైనా వస్తే వాటి గురించి ముందు దుష్ప్రచారం చేయడం, తర్వాత వాటిని మేమే తెచ్చామని క్రెడిట్ కోసం ఆరాటపడుతుంటారు జగన్, వైసీపీ నేతలు.
రాష్ట్రాభివృద్ధి జరుగుతుంటే సామాన్య ప్రజలు కూడా సంతోస్తారు. కానీ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై ఈవిధంగా దుష్ప్రచారం చేస్తుండటం చాలా శోచనీయమే కదా?
Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…