Telugu

“జక్కన్న” రివ్యూ – ఫస్టాఫ్ లో స్టోరీ… సెకండాఫ్ లో కామెడీ..!

విజయం కోసం వెండితెర పైకి దండయాత్రలు చేస్తున్న సునీల్ తాజాగా “జక్కన్న” రూపంలో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ “జక్కన్న” కధ విషయమై, స్వయంగా సునీలే ఓ చిన్నపాటి రివ్యూ రూపంలో ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర విశేషాలను తెలిపిన సునీల్…

‘జక్కన్న’ సినిమా విలువలు కలిగిన వ్యక్తి కథ అని, పర్ఫెక్షన్ కోరుకునే గణేష్ అనే వ్యక్తి పాత్రను ‘జక్కన్న’గా సినిమాలో పోషించానని తెలిపాడు. ఎవరైనా సాయం చేస్తే… వారికి జీవితాంతం సాయం చేసే వ్యక్తిగా కనిపిస్తానని, సినిమాలోని ఇతర పాత్రలకు ‘జక్కన్న’ ఏం చేస్తున్నాడో తెలియదని, అయితే ‘జక్కన్న’ మాత్రం అన్నీ క్లారిటీతో చేస్తుంటాడని సునీల్ చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

ఈ కథనమే ప్రేక్షకులను ఆకట్టుకుందని, సినిమాలో అన్ని రసాలు మిళితమై ఉంటాయని, ప్రేక్షకులు, అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయని, వాటితో పాటు మంచి కథ, కథనం కూడా ఉంటాయని అన్నాడు ఈ కమెడియన్ కం హీరో. ‘జక్కన్న’ కోసం అందరం కష్టపడి పని చేశామని, తనపై ఉన్న అంచనాలను ఈ సినిమా అందుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు సునీల్.

ధియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయని… ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని… ఫస్టాఫ్ లో ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తే, సెకండాఫ్ కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుందని సునీల్ పేర్కొన్నాడు. కామెడీ పాత్రలు వేయాలంటూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ‘జక్కన్న’ సినిమా చేసానని, ప్రేక్షకులు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పిఠాపురం … మంగళగిరి … కుప్పం…నేతల చిత్తశుద్ధికి నిదర్శనాలా.?

రాజకీయాలలో హామీలు ఇవ్వడం సులభం. కానీ వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం మాత్రం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల…

11 minutes ago

షర్మిల రీ ఎంట్రీ కోసం జగన్ ఎదురుచూస్తున్నారా.?

వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…

43 minutes ago