
ఇక తను హీరో పాత్రలతో పాటు, కమెడియన్ పాత్రలు వేయడానికి కూడా సిద్ధమని బహిరంగ ప్రకటన చేసారు. గతంలో కమెడియన్ రోల్స్ చాలా వచ్చాయని, అయితే మా సినిమాలో హీరోగా చేస్తూ, మళ్ళీ కమెడియన్ గా చేస్తే, మార్కెట్ పరంగా ఇబ్బంది ఎదురవుతుందని నిర్మాతలు చెప్పడంతో అవేమీ చేయలేదని, కానీ ఇక నుండి ఇతర సినిమాలలో కామెడీ పాత్రలు చేస్తానని, మీకు ఇష్టముంటే మీ సినిమాలో హీరోగా చేస్తాను అని ఖచ్చితంగా చెప్పేస్తానని సునీల్ చెప్పడంతో సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవేమో!
ప్రస్తుతం ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తున్న “టు కంట్రీస్” సినిమా విడుదలకు సిద్ధమవుతోందని, అలాగే తమిళ రీమేక్ “చదురంగ వెట్టై” సినిమాలో నటిస్తున్నానని, మరో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సునీల్, బహుశా ఈ సినిమాల మధ్యలోనే మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. హీరోగా మారిన తర్వాత సునీల్ లోని హాస్యాన్ని మిస్ అవుతున్నామని భావించిన సినీ అభిమానులకు, ఈ ప్రకటన ఊరటనిచ్చేదిగా మారింది.
Riya Suman knows how to make golden hour look like her own fashion runway. Against…
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…