
భాషపై పట్టు లేకపోవడంతో సహజంగానే సన్నీ ఆలాపనలో పొరపాట్లు దొర్లాయి. పదాలను పలకడంతో పాటు, రాగం ఆలపించడం వరకు సన్నీలియోన్ పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని పేర్కొంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వచ్చి రాని భాషతో సన్నీలియోన్ కొత్త చిక్కులు కొని తెచ్చుకుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తన గీతాలాపనపై సన్నీలియోన్ సదరు స్టేజ్ పైనే వివరణ ఇచ్చుకుంది.
ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి రావడం, ముఖ్యంగా జాతీయ గీతం ఆలపించడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పిన సన్నీ లియోన్, జాతీయ గీతం ఆలపించే సమయంలో కంగారు పడిన మాట వాస్తవమేనని అంది. అయితే ఆ గీతం ఆలపించడం తన అదృష్టమని పేర్కొన్న సన్నీ, తన జీవితం ధన్యమైందని తెలిపింది. ఈ గీతాలాపనకు చాలా సమయం ప్రాక్టీస్ చేశానని కూడా ప్రస్తావించింది.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…