
చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకల కోసం తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఓఎస్‌ఆర్టీ ఆప్షన్ రూపొందించింది. అయితే ఈ ఆప్షన్ పేజ్ ను ఓపెన్ చేసిన అధికారులకు సన్నీలియోన్ అందాలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో తల పట్టుకున్న అధికారులు, వెనువెంటనే సాంకేతిక నిపుణులకు సమాచారం అందించారు.
ఎవరో హ్యాకర్లు ఈ పని చేసి ఉంటారని, ఇటీవల కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ అయిపోయాయని టెక్నికల్ టీం అధికారులకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సన్నీలియోన్ ఫోటోను పోస్ట్ చేయడం మినహా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ ఇతర సమాచారంపై దృష్టి పెట్టకపోవడంపై ఎవరో ఆకతాయి ఈ పని చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారిక వెబ్‌సైట్‌లో సన్నీలియోన్ న్యూడ్ ఫోటో ఒక సెన్సేషన్ అయ్యింది.
Srikanth Odela made a promising debut with Dasara starring Nani. The film had its flaws,…
A software engineer on H-1B took to Reddit after being laid off. They had attended…