
ఇదిలా ఉంటే, భారత్ ప్రతీకార చర్యలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయు, సైనిక బలగాలు మెరుపుదాడులు చేసి 38 మంది ముష్కరులను హతమార్చారని తెలియగానే… పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్యాంటు వీడిపోయిందని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే దీని వెనుక అసలు వాస్తవం గమనిస్తే…
ఇది పాత వీడియోనే. ఏదో సందర్భంలో అతిథులను ఆహ్వానిస్తున్న ఖ్వాజా మహ్మద్ ప్యాంటు అనుకోకుండా ఊడిపోయింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆయన ప్యాంట్ ను సరిచేసుకున్నారు. అయితే ఈ అవకాశాన్ని నెటిజన్లు ఇండియా రివెంజ్ కు వాడేసుకున్నారు. ఒంటి మీద ప్యాంట్ కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్ ను బెదిరిస్తున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే… భారత్ తో పాటు పాక్ మీడియాలో కూడా ఈ వీడియో సర్క్యూలేట్ అవుతుండడం. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!
Several prominent names have been doing the rounds for the female lead opposite Ram Charan…
Shah Rukh Khan’s King has reportedly secured the biggest overseas distribution deal ever for an…