
[m9ad]
ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కు పిలిచేవారని, తాను సిద్ధమై కార్వన్ లో కూర్చుంటే, సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్ చేసి పేకప్ చెప్పేవారని, షూటింగ్ లేకుంటే తనకు విషయం చెప్పేవారు కాదని వెల్లడించింది. ఈ అనుభవంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం పట్టుకుందని చెప్పింది. అయితే, ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని, ఆ హీరోకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, అతని పేరును ఇప్పుడు తాను చెప్పలేనని, చెబితే తన కెరీర్ ని నాశనం చేస్తారని వాపోయింది.
అయితే ఏదొకరోజు అతగాడి పేరు చెబుతానని, ఆ హీరోని మాత్రం వదలేది లేదని అంది. అమైరా గతంలో ధనుష్ తో కలసి ‘అనేగన్’ అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించిన విషయం తెలిసిందే. ఆమె చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందన్న టాక్ ఊపందుకుంది. పలువురు అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు ధనుష్ అల్లుడన్న సంగతి తెలిసిందే.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…