
సదరు నిర్మాత చెప్పిన దాంట్లో కొంత లాజిక్ ఉన్నప్పటికీ, అలా పోల్చుకుంటే, ఆయన సినిమా ‘గద్దర్’ సాధించిన కలెక్షన్స్ ను అంతకు ముందు సినిమాలతో పోలిస్తే… ‘గద్దర్’ కూడా చిన్నబోతుందన్న లాజిక్ ను మరచినట్లున్నారు. అయితే ఇదే దీనిపై సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘తెలుగు సినిమా స్థాయి పెరిగిన దానిపై’ తన అభిప్రాయాన్ని చెప్తూ… నాటి పరిస్థితులను, నేటి పరిస్థితులను అనునయించి సవివరంగా తెలిపారు.
ఒకప్పుడు పాతిక ధియేటర్లలో సినిమా తెరపైకి వస్తే గొప్ప విడుదల… ఇప్పుడు స్టార్ హీరో సినిమా వస్తే ఒక్క హైదరాబాద్ లోనే 120 ధియేటర్లలో విడుదల అవుతోంది. వారం రోజుల వసూళ్లు ఒక్క రోజులో వచ్చినట్లే కదా! అందుకే లాంగ్ రన్ ఉండడం లేదు. ఉదాహరణకు ‘అల్లూరి సీతారామరాజు’ పాతిక వారాలు విజయవాడ జైహింద్ ధియేటర్లో ఆడితే వచ్చిన కలెక్షన్… లక్షన్నర్ర రూపాయిలు. అది కూడా అప్పటి టికెట్ ధర రూపాయిన్నర్ర! అదే ఇప్పుడున్న ధరలతో ఎంత రికార్డ్ అవుతుంది… ఏ కాలం లెక్కలు అప్పటివరకే చూడాలి… అంటూ తెలిపారు కృష్ణ.
అయితే ఈ పాటి కనీస ఆలోచనలు కూడా కొందరు బాలీవుడ్ వర్గాలు చేయకుండా… ‘బాహుబలి 2’ సినిమాపై తమ ఆధిపత్యం కోసం విఫలయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ కూడా తన ‘దంగల్’ సినిమా చైనాలో సాధించిన కలెక్షన్స్ తో కలిపి ఓవరాల్ గా ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ను దాటిన తర్వాతే, ఈ సినిమాపై తన అభిప్రాయం చెప్పారు… అది కూడా ఇంకా చూడకుండానే..! కాస్త విలువలతో కూడిన ఆలోచనలు మనకు సొంతం అంటూ సూపర్ స్టార్ కృష్ణ నిరూపించగా, అలాంటి వాటికి ఇక్కడ తావు లేదంటూ ‘గద్దర్’ నిర్మాత చాటిచెప్పారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…