వివేకా హత్య కేసు విచారణ మమతో ముగింపు?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాలుగేళ్ళ విచారణ తర్వాత కీలకదశకు చేరుకొన్నప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సీబీఐ దర్యాప్తు బృందాన్ని మార్చక తప్పలేదు. ఇది వరకు ఈ బృందానికి రామ్‌సింగ్‌ నేతృత్వం వహిస్తుండగా ఇప్పుడు ఆయన స్థానంలో సీబీఐ డిఐజీ కెఆర్. చౌరాసియా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ సింగ్‌ తదితరులున్నారు. ఈ బృందానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపి ఏప్రిల్ 30వ తేదీలోగా ఈ కేసు విచారణను పూర్తిచేసి, ఈ కుట్రను చేదించి, వివేకా హంతకులను కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ADVERTISEMENT

ఈ కేసులో ఏ5 నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌తో ఈ మార్పులు జరిగాయని చెప్పవచ్చు. ఈ కేసు విచారణ చాలా ఆలస్యమైనందున తన భర్తకు బెయిల్‌ మంజూరు చేయాలనే ఆమె విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దాదాపు నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ ఏపీలో కొనసాగుతున్నప్పుడు సీబీఐ కూడా ధైర్యంగా దర్యాప్తు చేయలేని పరిస్థితులను ఎదుర్కొంది. అప్పుడే వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకొన్నారు. అప్పటి నుంచే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

ఈ కేసు విచారణ తుది దశకు చేరుకొన్నప్పుడు హటాత్తుగా ఈ మార్పు జరుగడంతో కేసు విచారణ వేరే కోణంలో మొదలవవచ్చు. అదే కనుక జరిగితే దోషులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేసులో సీబీఐ ఏవిదంగా ముందుకు సాగబోతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏప్రిల్ 30వ తేదీలోగా ముగించాల్సి ఉంది కనుక ‘మమ’ అనిపించక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CJP Protests: Is Abhijeet Dipke Justified in Insulting PM Modi?

The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…

5 minutes ago

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

36 minutes ago