
వైసీపీ లిక్కర్ కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి ని దర్యాప్తు అధికారి వద్ద లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో అనేకమంది వైసీపీ నాయకులు, జగన్ సన్నిహితులు అరెస్టయ్యి జైలుకు వెళ్లారు ఆ పై బెయిలు పొంది బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా సంబంధిత అధికారి వద్ద లొంగిపోవాలంటూ సుప్రీం ఆదేశించడంతో అందుకు అవినాష్ ఇప్పటికే ముందస్తు బెయిలు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అవినాష్ బెయిలు కోసం దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అవినాష్ అభ్యర్ధనను కొట్టేసింది.
ముందుగా దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని, ఆ పై ట్రయిల్ కోర్ట్ లో బెయిలు కోసం పిటిషన్ వేసుకోవాలంటూ సుప్రీం తేల్చిచెప్పడంతో ఇక అవినాష్ లొంగుబాటు తప్పనిసరైయ్యింది. అయితే గతంలో కూడా ఇదేమాదిరి అవినాష్ రెడ్డిని వైస్ వివేకా హత్య కేసులో అరెస్టు చేసి అదే రోజు బెయిలు తో బయటకు పంపించారు.
మరి ఇప్పుడు కూడా అవినాష్ లిక్కర్ కేసులో అలా వచ్చి ఇలా వెళ్తారా.? లేదా లిక్కర్ కేసులో అరెస్టైన ఇతర నేతల మాదిరి కొన్నాళ్ళు జైలు జీవితం అనుభవిస్తారా అన్నది చూడాలి. అయితే అవినాష్ రెడ్డి కోసం జగన్ ఉన్నారు, ఉంటారు కాబట్టి అవినాష్ లొంగుబాటు తరువాత జరగాల్సిన తంతు మొత్తం జగన్ దగ్గరుండి పర్యవేక్షించే అవకాశం ఉంది.
Dasara is turning into another Sankranti of sorts at the Telugu box office, with several…
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…