Telugu

ధర్మాసనం: ఉచితాలు సముచితం కాదు

భారతదేశ న్యాయవ్యవస్థకు సుప్రీం కోర్ట్ అంతిమ న్యాయనిర్ణీత. ధర్మాసనం ఇచ్చిన తీర్పే అందరికి రాజశాసనం వంటిది. అటువంటి సుప్రీం కోర్ట్ దేశంలో అమలవుతున్న ఉచిత పథకాల మీద అసహనం వ్యక్తం చేసింది. ఇలా పంచుకుంటూ పొతే ఇక అభివృద్ధికి నిధులెక్కడిని నుంచి వస్తాయి.?

రాష్ట్ర బడ్జెట్ లో సింహ భాగం సంక్షేమ పథకాల రూపంలో ఈ ఉచితాలకే కేటాయిస్తుంటే ఇక రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశ పురోగతి ఎలా సాధ్యమవుతుంది.? రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్ధం కోసం ప్రజలకు ఉచితాలు అనే ఎరను వేసి అధికారం అనే ఆహారాన్ని పొందుతున్నారు అంటూ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ ఉచిత పథకాల మీద విమర్శలు చేశారు.

ADVERTISEMENT

అసలు విషయానికొస్తే తమిళనాడు లో ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ పెరిగింది. కొత్త పార్టీల పుట్టుక, అధికార – ప్రతిపక్షాల పోటాపోటీ ఉచితాల పరిధిని పెంచాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రజలను తమ పార్టీకి ఓటర్లుగా మలుచుకోవడానికి ఈ ఉచితాల ప్రకటన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనను వెల్లడించింది.

దీనితో ఈ ప్రతిపాదన పై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ఉచితాలు ఎంతవరకు సముచితం అంటూ రాజకీయ పార్టీలను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జరిపిన విచారణలో ఉచితాల పై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆర్థిక లోటు తో అల్లాడుతున్న రాష్ట్రాలు సైతం ఈ ఉచితాల పంపిణి విషయంలో తగ్గేదెలా అన్నటుగా ముందుకెళ్లడం ఏంటి.? కేవలం ఎన్నికల ముందే రాజకీయ పార్టీలకు ఈ ఉచిత పథకాలు ఎందుకు గుర్తొస్తుంటాయి.? ఇది బుజ్జగింపు రాజకీయ విధానం కాదా.?

లబ్ధిదారుని ఆర్థిక స్తోమత కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇలా అందరికి ఉచిత విద్యుత్ అంటూ ప్రకటిస్తే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచినట్టేగా.? ఇది కేవలం ఒక్క తమినాడు సమస్యే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ ఉచితాల పరంపర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది.

ఇక ఇక్కడితో ఈ సంస్కృతికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీం కోర్ట్ ఉచితాల మీద తన అసహనాని ప్రకటించింది. అయితే వాస్తవంగా ఈ అంశం పై ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అలాగే ఆర్థిక రంగ విశ్లేషకులు సైతం ఈ ఉచితాల పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

అయినా కూడా రాజకీయ నాయకులు తమ తమ రాజకీయ లబ్ది కోసం ఈ ఉచిత పథకాలను పెంచి పోషిస్తున్నారు, అలాగే ప్రజలు కూడా ఈ ఉచితాల మోజులో పడి తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తామే చేచేతుల నిప్పు పెట్టుకుంటున్నారు. ఒకవర్గం ఓట్ల ఆకర్షణ కోసం మొదలైన ఈ ఉచిత పథకాలు ఇప్పుడు మరొక వర్గాన్ని సంతృప్తి చేయడానికి విస్తరించాల్సిన పరిస్థితికి వచ్చింది.

ఇలా ఒకరిని ఆకర్షించడానికి, మరొకరిని సంతృత్తి పరచడానికి ఉచితాల సంఖ్యను పెంచుకుంటూ పొతే ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న భారతం మరో కొన్ని తరాల భావి భవిష్యత్ ని వెనక్కి నెట్టినట్టే అవుతుంది. దాని మూల్యం రానున్న తరాలు భరించాల్సి ఉంటుంది.

ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ ఉచితాల కవచంతో ప్రజలతో ఆడుతున్న రాజకీయ ఆటలకు చెక్ పెట్టి తాత్కాలిక ప్రయోజనాలను విడనాడి శాశ్వత ప్రయోజనాల కోసం అడుగులు వెయ్యాలని ఆశిద్దాం..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Trivikram’s God of War: NTR Fans Panic After AK47 Fiasco

NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…

6 hours ago

IND vs WI T20: Sarpanch Destroys WI! Nightmare Begins?

Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…

6 hours ago