
పిఠాపురం జూన్ 4 తరువాత దీని సౌండ్ మరో లెవెల్ లో ఉండబోతుంది అంటూ పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ svsn వర్మ పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పవన్ అభిమానులు వర్మకు ఫాన్స్ గా మారిపోతున్నారు.
పిఠాపురం నుండి టీడీపీ టికెట్ ఆశించిన వర్మ పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన అధినేత పవన్ కోసం త్యాగం చేసారు. అయితే వర్మ ఒక ప్రజాబలమున్న నాయకుడు కావడంతో పవన్ తన గెలుపు బాధ్యతను వర్మ భుజాల మీద పెట్టి కూటమి విజయాన్ని తన భుజాల మీద వేసుకున్నారు పవన్.
అయితే ఆశించిన సీటు రాకపోవడంతో ముందుగా కాస్త నిరుత్సాపడ్డ వర్మ ఆ తరువాత కాలంలో పవన్ కు అత్యంతం సన్నిహితుడుగా మారిపోయారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలలో పిఠాపురంలో పవన్ మెజారిటీ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకుంటుందని, జూన్ 4 న పిఠాపురం మీడియాలో మోతమోగుతుందని పవన్ విజయం పై భారీ అంచనాలను పెంచుతున్నారు వర్మ.
ఏ టీవీ ఇంటర్వ్యూ లో చూసిన, ఏ యు ట్యూబ్ ఛానెల్స్ లో చూసిన ఇప్పుడు వర్మే దర్శనమిస్తున్నారు. స్వయంగా ఆయనే నేను పవన్ తో లవ్ లో పడిపోయానని, పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయాయనని చెపుతూ పవన్ అభిమానులకు, జనసైనికులకు చాల దగ్గరయ్యారు వర్మ. మీడియాలో ఒక్క్కొక్కరు పవన్ గురించి అడుగుతున్న ప్రశ్నలకు వర్మ ఒక రేంజ్లో సమాధానం చెపుతున్నారు.
కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ శపధాలు చేస్తున్నారు దానికి మీ సమాధానం అంటే తాకకపోయితే బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు అంటూ, అలాగే జూన్ 4 ఫలితాల రోజు పవన్ పిఠాపురంలో ఉంటే ఈ జనసంద్రాన్ని ఆపడానికి పోలీసులు సరిపోరు అంటూ పవన్ గురించి మాస్ ఎలివేషన్స్ ఇస్తు జనసైనికులకు కికెక్కిస్తున్నారు వర్మ.
ఇపుడు సోషల్ మీడియా అంతటా వర్మ వీడియో లే వైరల్ అవుతున్నాయి. వర్మ, పిఠాపురం MLA గారి తాలూకా…అంటూ వర్మను తమ భుజాల మీద మోస్తున్నారు పవన్ అభిమానులు. ఒకప్పుడు పిఠాపురం వాస్తవ్యులకు మాత్రమే తెలిసిన వర్మ పేరు ఇప్పుడు దేశమంతా తెలిసిందని, తానూ చేసిన త్యాగానికి ఫలితం దక్కిందనే విజయ గర్వాన్ని వర్మ ఇప్పటికే అనుభవిస్తునట్టుంది అంటున్నారు జనసైనికులు.
పవన్ ఒక స్వార్థం లేని రాజకీయ నాయకుడని, డబ్బు కోసమో, పదవుల కోసమో ఆరాటపడే వ్యక్తి కాదని, చంద్రబాబు అరెస్టైన సందర్భంలో మరో రాజకీయ నాయకుడైతే ఆ సమయంలో తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడని, కానీ పవన్ మాత్రం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికే ముందుకొచ్చాడు.
వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ఇచ్చిన మాట కోసం తన పార్టీ బలాన్ని తగ్గించుకుని మరి కూటమిని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసిన నిస్వార్థ నాయకుడు పవన్ అంటూ వర్మ పవన్ వ్యతిరేకులకు కూడా పవన్ పై ఉన్న అభిప్రాయాన్ని మారుస్తున్నారు.
It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…
“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…