Telugu

‘సైరా’పై వచ్చింది ఒట్టి పుకారే!

చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా’ తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరును ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ మొదలు కాకపోవడం వలన, నయనతార డేట్స్ ను సర్దుబాటు చేయలేకపోతోందనే టాక్ బయటికి వచ్చింది.

ఆమె కారణంగానే రెండవ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదనీ, మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. నయనతార ముందుగా ఇచ్చిన డేట్స్ ప్రకారమే ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి రానుందని అంటున్నారు. చిరంజీవి – నయనతార కాంబినేషన్లోని సన్నివేశాలను ఫిబ్రవరిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ .. జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిన్న శ్రీను గురించి ముందే తెలుసన్నప్పుడు కన్నీళ్ళు దేనికి?

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ…

17 minutes ago

Enough Mass Films? Nani Wants a Change

Nani seems to be ready for a change after spending the last few years in…

18 minutes ago