
ఇక టీజర్ విషయానికి వస్తే విజువల్స్, ఫైట్స్ అన్ని అదిరిపోయాయి. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమని చాలా తేలికగా అర్ధం అవుతుంది. “చరిత్రలో మనం ఉండక పోవచ్చు…చరిత్ర మనతో మొదలవ్వాలి,” రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఇక మైనస్ల విషయానికి వస్తే ఇప్పటికే వచ్చిన పోస్టర్ల, మేకింగ్ వీడియోల విషయంలో అభిప్రాయపడినట్టే చిరంజీవి గెట్ అప్ విషయంలో మరికొంత కేర్ తీసుకోవాలని అనిపించింది. సోషల్ మీడియాలో కొందరైతే ఈ సినిమా రామ్ చరణ్ తీసుంటే అదిరిపోయేది అంటున్నారు.
మొత్తానికి టీజర్ చాలా వరకూ అక్కట్టుకుందనే చెప్పుకోవాలి. సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి కోరికగా ఉంది. చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చెయ్యడం తమకు బాలీవుడ్ లో కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తుంది. అక్కడ హైప్ కోసమే ఈరోజు టీజర్ ముంబైలో లాంచ్ చేసింది.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…