
“ఆ కథకి నేనే కావాలని చెప్పి, నా కోసం ఏడాది పాటు ఆ చిత్రం యూనిట్ ఎదురుచూసింది. అందుకే, కాదనలేక ఆ సినిమా చేశాను. పైగా నాకు ఎంతో గౌరవం కూడా ఇచ్చారు. అంతేకాదు, ఆ సినిమా లాభాల నుంచి కోటి రూపాయలు కూడా ఇచ్చారు” అని చెప్పింది తాప్సీ. ఆర్టిస్టుగా తనకు గౌరవం ఇచ్చే వారితోనూ, తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చేవారితోను నటించడానికి తాను ఇష్టపడతానని తాప్సీ చెప్పింది.
గతంలో ఓ తెలుగు సినిమా విషయంలో ఎదురైన చేదు అనుభవమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆమె చెప్పింది. ‘నాకు ముందుగా కథ చెప్పినప్పుడు ఆ సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ వేరేలా వుంది. తీరా షూటింగుకి వెళ్లాక మరోలా తీశారు. ఇదేమిటని దర్శకుడిని అడిగితే, హీరో మార్చమన్నారని, దీంతో మనకు గౌరవం, విలువ ఇచ్చే వాళ్లతోనే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని’ చెప్పుకొచ్చింది.
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…