Telugu

తాడిపత్రి మరో పులివెందుల కానుందా?

పులివెందుల రాజకీయాలు ఎలా ఉంటాయి? పులివెందులలో ఎన్నికల తంతు ఎలా ప్రారంభం అవుతుంది? ఎలా ముగుస్తుంది? అనేదానికి తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణలు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల కేంద్రంగా ఎన్నికల ప్రక్రియలో హింస చెలరేగింది.

ప్రత్యర్థి పార్టీల నేతల మీద దాడులు, వ్యక్తిగత ఆస్తుల ధ్వంశం వంటి ఘటనలకు పులివెందుల వేదికయ్యింది. అయితే ఇప్పుడు ఏపీలో మరో నియోజకవర్గంలో కూడా రాజకీయ పరిస్థితులు పులివెందుల రాజకీయాలను తలపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT

తాడిపత్రి కేంద్రంగా అధికార టీడీపీ నేత జేసీ ప్రభాకర్ vs విపక్ష వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సీరియల్ మాదిరి సాగుతున్న రాజకీయ పోరు యాక్షన్ ఫిల్మ్ రూపంలోకి మారుతుంది. ఈ ఇద్దరి నేతల మధ్య గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచి మొదలైన రాజకీయ ఆధిపత్యం ఇప్పుడు కూటమి రాకతో మరోమెట్టు ఎక్కిందని చెప్పాలి.

నాటి వైసీపీ ప్రభుత్వ చేదు జ్ఞాపకాలకు నేడు తానూ చేస్తుంది కేవలం యాక్షన్ కి రియాక్షన్ మాత్రమే అని, నాటి వైసీపీ తనకు ఇచ్చిన గిఫ్ట్ కి ఇప్పుడు తానూ ఇస్తుంది కేవలం రిటర్న్ గిఫ్ట్ మాత్రమే అంటూ, నాటి చర్యలకు నేటి కర్మ ఫలం అంటూ తన చర్యలను జేసీ సమర్ధించుకుంటున్నారు. ఇక జేసీ చేస్తుంది రాజకీయ కక్ష సాధింపు చర్యలంటూ పెద్దారెడ్డి తన వాదన వినిపిస్తున్నారు.

ఇలా వీరిద్దరి రాజకీయ ఆధిపత్య పోరాటంలో ఇరువురు పార్టీల నేతలతో పాటు అటు సామాన్య ప్రజానీకం కూడా నలిగిపోతుంది. అలాగే ఇరువర్గాల అనుచరులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీనితో తాడిపత్రి మరో పులివెందుల కానుందా? అన్న చర్చ నడుస్తుంది.

అయితే ఇక్కడ ఇద్దరు నేతలు కేవలం తమ పంతం నిలబెట్టుకోవడానికే పెద్ద పీట వేస్తున్నారు, తమ రాజకీయ పట్టు కోసమే పంతం పడుతున్నారు, కానీ ఆ పంతం తాలూకా జరిగిన, జరుగుతున్న, జరగబోయే రాజకీయ నష్టాన్ని కానీ, సమాజ కీడును కానీ ఊహించలేకపొతున్నారు.

ఇలానే ఈ రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం కత్తులు దూసుకుంటూ, నిరసనలు, ధర్నాలు అంటూ రోడ్ల మీదకు రావడంతో తాడిపత్రి లో ఎప్పుడు ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అలాగే ఏదొక వివాదస్పద వార్తతో తాడిపత్రి నిత్యం మీడియా వార్తల్లో నిలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

King100 Rumors: Nagarjuna Follows the Trend He Slammed?

Tollywood's postponement trend continues, making the release calendar unpredictable. Several films are moving away from…

16 minutes ago

Pawan Kalyan’s 2029 Strategy: A Bigger Political Game

Jana Sena is gradually moving beyond its traditional strongholds in the Godavari districts. Its growing…

45 minutes ago