
అభివృద్ధిని విస్మరించి, రాజధానిని పక్కన పడేసి నాలుగున్నరేళ్ళుగా సంక్షేమ పధకాల పేరుతో ఓట్ల కోసం తాపత్రయపడుతూ, వాటి కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తూ, టిడిపి, జనసేనలను వెంటాడి, వేధిస్తుండటం చూసి రాష్ట్రంలో ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా… వైసీపి పాలన నుంచి విముక్తి పొందుదామా అని ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రాలో 54 శాతం పైగా ప్రజలు వైసీపి బెడద వదిలించుకోవాలని ఆతృత్రగా ఎదురుచూస్తుంటే, పొరుగు రాష్ట్రం తమిళనాడులో ప్రజలు జగన్ వంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండును… వైసీపి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు మాకు వచ్చి ఉండేవని ఆరాటపడుతున్నారట!
ఏపీ సరిహద్దులోని మిట్టపాలెం గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పధకాలును చూసి పక్కనే ఉన్న పున్నియం గ్రామస్తులు మాకూ జగన్ వంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండును అని కోరుకొంటున్నారట! మిట్టపాలెంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ వంటివన్నీ ఉన్నాయని కానీ తమ గ్రామంలో పంచాయితీ కార్యాలయం కూడా ఎప్పుడూ తాళం వేసే ఉంటుందని పున్నియం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారట!
వారికి సచివాలయాలు, సంక్షేమ పధకాలే కనిపిస్తున్నాయి కానీ వాటి కోసం వైసీపి ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు, ఆ భారం మోస్తున్న ప్రజలను చూడలేకపోతున్నారు. ఏపీలో ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేని దుస్థితిలో వైసీపి ప్రభుత్వం ఉందనే సంగతి వారికి తెలిసిన్నట్లు లేదు. వైసీపి రంగులు చూసి కామధేనువు అనుకొంటున్నారు తప్ప దాని వెనుక సింహం దాగి ఉందని గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ తమిళ ప్రజలందరూ జగన్ కావాలని ముక్తకంఠంతో కోరుకొంటే వారి కోరికను తీర్చడానికి వెనకాడకపోవచ్చు.
BOTTOM LINE History Without Heart RATING 2/5 Story, Screenplay, Director: Rahul Sankrityan Cast: Vijay Deverakonda,…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…