
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగిస్తూ తీర్మానం చేసిన సమయంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ… సీఎం పదవిని కూడా ఆమెకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ సందేశం అందుకే కాబోలు అని భావించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజనీమా చేయబోతున్నారని, శశికళ సీఎం కానున్నారని అనుకుని శుక్రవారం మధ్యాహ్నం కల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మళ్లీ పార్టీ కార్యాలయానికి రావడంతో పుకార్లు ఊపందుకున్నాయి. పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగబోతుందని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేలకు మరో వార్త అందింది. శనివారం పార్టీ పగ్గాలు అందుకోనున్న శశికళ… జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు రానున్నారని, నేతలు సిద్దంగా ఉండాలని కబురు అందింది. దీంతో అప్పటి వరకు వ్యాపించినవన్నీ వదంతులేనని తేలింది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…