
‘కాటమరాయుడు’ విడుదల తర్వాత ఓ మీడియా ఛానల్ సదరు సినిమాకు రేటింగ్ ఇచ్చే క్రమంలో… పవన్ అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించి, సదరు మీడియా సినిమాకు 3 పాయింట్లు రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ తో సంతృప్తి చెందని పవన్ ఫ్యాన్స్… మా అభిమాన హీరో సినిమాకు ఇంత తక్కువ స్థాయి పాయింట్స్ ఇస్తారా? అంటూ అక్కడున్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి యాంకర్ పై తిరగబడ్డారు.
అలాగే వెబ్ మీడియాలో రివ్యూ రాసిన ఓ వ్యక్తిని బెదిరిస్తూ… వాట్సప్ లో సందేశాలు ఇచ్చిన ఉదంతం కూడా బయట పడింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు హద్దులు దాటుతున్నారన్న అభియోగానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇది యూనివర్సల్ గా పవన్ అందరి అభిమానుల గురించి చెప్పలేం గానీ, అత్యుత్సాహం ప్రదర్శించే కొందరు అభిమానుల వలన పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని గమనించాలి.
సరిగ్గా తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇదే అభిప్రాయ పడ్డారు. సినిమా విడుదలైన తర్వాత నెట్ లో రకరకాల రివ్యూలు వస్తాయని, వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఆడుతుందని, అయినా పవన్ లాంటి హీరోకు రివ్యూలతో పని లేదని, అభిమానులు కాస్త సంయమనం వహించి నడుచుకోవాలని హితవు పలికారు. నిజానికి పవన్ కూడా ఇలాంటి చర్యలను హర్షించరని, సున్నిత మనస్కుడు అయిన పవన్ ను బాధపెట్టిన వారే అవుతారని తమ్మారెడ్డి ఈ సందర్భంగా పలు సూచనలు చేసారు.
సమాజానికి మంచి చేయాలని తదుపరి ఎన్నికలలో బరిలోకి పవన్ దిగనున్నారని, సమాజానికి మంచి చేయడమంటే బెదిరించడం కాదని, సమాజంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరూ నిర్ధేశించకూడదని పవన్ ఫ్యాన్స్ కు కాస్త మెత్తగా చెప్పారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తెప్పించడానికి ఫ్యాన్స్ ప్రయత్నాలు చేయాలి గానీ, చెడ్డ పేరు కాదు… ఆలోచించుకోండి అంటున్నారు తమ్మారెడ్డి.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…