
కథ చెప్పమంటే అప్పుడు సూటిగా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు కట్ చేస్తే అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారని అన్నాడు. సినిమాలో ప్రేక్షకులకు పనికొచ్చే అంశం ఉండాలి …అది నాచురల్ గా ఉండాలి ఇది పక్కన పెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవన్నారు. అంతే కాకుండా చిరంజీవి చేసిన రుద్రవీణ, శుభలేఖ, స్వయం కృషి సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కిందని… అమీర్ ఖాన్ దంగల్ లాంటి సినిమా చిరంజీవి చేసినా చూస్తారన్నారు.
భోళా శంకర్…గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేసి నిరాశ చెందటం కంటే నేచురల్ సినిమాలు చేస్తే బెటర్ అని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చిరంజీవితో చెబుదామని ప్రయత్నించా కానీ ఎందుకో కుదరలేదని అన్నారు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనబడేవారు..మళ్లీ ఆ చిరంజీవి కనిపిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు తమ్మారెడ్డి చెబితే చిరు వింటాడా….? అన్నది ప్రశ్నగా మారింది.
రీమేక్ సినిమాలు వద్దు బాబోయ్ అంటూ అభిమానులు ముందు నుండి చిరును కోరుతున్నారు. చిరు రీమేక్ సినిమాలపై తరచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా చిరు తగ్గటం లేదు. వరుస పెట్టి మరీ రీమేక్ కు చేస్తున్నాడు. ఇక తమ్మారెడ్డి విషయానికి వస్తే ఒకప్పుడు నిర్మాతగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు తరచూ యుట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. మరోవైపు గతంలో తమారెడ్డి చిరు పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది తెలిసిందే. దాంతో నాగబాబు రంగంలోకి దిగి రచ్చ చేశారు. మరి ఇప్పుడు తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…