
ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఎదురయ్యింది. ఆయన విద్యార్హతలకు సంబందించిన సర్టిఫికెట్లన్నీ నఖిలీవని, అత్యున్నత పదవిలో ఉన్న ఆయన నఖిలి సర్టిఫికెట్లతొ చెలామణి అవ్వడం అంటే ప్రజలను మోసం చేయడమే అనే విమర్శలు టీడీపీ నేతలు బహిరంగంగానే చేస్తున్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నన్నూరు నర్సిరెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరి విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని మీడియా ముందు బహిర్గతం చేశారు. అయినా ఇంతవరకు స్పీకర్ తమ్మినేని నుండి ఎలాంటి ఖండన రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నన్నూరు నర్సిరెడ్డి చేస్తున్న విమర్శలు ఇలా ఉన్నాయి…
1. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో మరియు టి.వి డిబేట్ లలో డిగ్రీ అసంపూర్ణంగా విడిచిపెట్టేశానని చెప్పడం.
2. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీలో తమ్మినేని ఎల్.ఎల్.బి కోర్సు చేస్తున్నారని తెలిసి, ఆయనకు సంబంధించిన హల్ టికెట్ నెంబరుతో తమ్మినేని చదువుతున్నారా లేదా అనే విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా యూనివర్సిటీ అధికారులను అడుగగా తమ్మినేని చదువుతున్నట్లుగా నిర్ధారించారని చెప్పడం.
3. ఎల్.ఎల్.బి చదవడానికి తమ్మినేని సమర్పించిన విద్యార్హతలకు సంబంధించి జతపరిచిన ప్రతులను సమాచార హక్కు చట్టం నుండి యూనివర్శిటీ అధికారులను నర్సిరెడ్డి కోరాగా.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి నాగర్ కర్నూల్ కి చెందిన స్టడీ సెంటర్ ద్వారా 2015 -16, 2016-17, 2017-18 సంవత్సరంలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు చేసిన ప్రతులని సమర్పించినట్లుగా యూనివర్సిటీ అధికారు తెలిపారని చెప్పడం.
4. ఈ సమాచారంతో అసలు నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుండి 2015 నుండి 2018 వరకు చదివిన విద్యార్థుల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులను నర్సిరెడ్డి కోరడం.
5. నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుండి మొత్తం 839 మంది విద్యార్థులు చదివినట్లుగా అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కానీ 839 మంది విద్యార్దుల్లో తమ్మినేని పేరు లేదని నన్నూరు నర్సిరెడ్డి చెప్తున్నారు.
6. అంతేకాకుండా తమ్మినేని చెప్తున్న హల్ టికెట్ నెంబర్ ఆయనది కాదని అది డి. భగవంత్ రెడ్డి, తండ్రి స్వామి రెడ్డి అనే పేరు మీద ఉందని నర్సిరెడ్డి చెప్తున్నారు.
ఈ సమాచారం మొత్తాన్ని ఒకటికి పది సార్లు యూనివర్సిటీ అధికారుల నుండి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు నఖిలి అని నిర్ధారించిన తరువాతనే తాను మీడియా ముందుకి వచ్చినట్లుగా నర్సిరెడ్డి తెలిపారు.
తమ్మినేని గౌరవప్రదమైన పదవిలో ఉన్నారని, ఆయనే ఈ నఖిలి సర్టిఫికెట్లు తయారు చేశారా లేక నఖిలి సర్టిఫికెట్ల వారితో సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఈ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయో తమ్మినేని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తమ్మినేని స్పందించకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు.
వస్తున్న ఆరోపణలపై తమ్మినేని ఎలా స్పందిస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…