
రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించే ప్రక్రియలో భాగంగా ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయిన టీసీఎస్ కంపనీకి విశాఖలో ఎకరం 99 పైసల చొప్పున 21 ఎకరాల భూమిని కేటాయించారు. దీనితో విశాఖ సముద్ర తీరంలో టీసీఎస్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
అయితే ప్రభుత్వం ఇంత తక్కువ స్థాయిలో టీసీఎస్ కి భూ కేటాయింపులు జరపడం మీద కొంతమంది అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అయితే వాటిని విచారించిన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
పరిశ్రమలను ఆహ్వానించాహడానికి సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీలను తప్పుపట్టలేము, ఎకరా 99 పైసలకు ఇస్తే తప్పేముంది.? అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఎంత రేటుతో భూమి కట్టబెడుతున్నారు అనేదానికన్నా టీసీఎస్ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది అనేది చూడాలి అంటూ వ్యాఖ్యానించింది.
పొరుగు రాష్ట్రాలకు ధీటుగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ వృద్ధి చెందాలి అంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అనే భావన అటు సామాన్య ప్రజానీకం నుండి కూడా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాల పేరుతో దోపిడీకి గురయ్యింది.
కానీ నేడు ప్రభుత్వం పరిశ్రమల రాక కోసం పెట్టుబడులను ఆహ్వానించడం కోసం భూమి తక్కువ రేటుకు ఇవ్వడంలో తప్పులేదనేది యదార్ధం. తద్వారా వేల మంది యువతకు సొంత రాష్ట్రంలోనే ఉపాధి దొరుకుతుంది. టాక్స్ ల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతుంది.
Nabha Natesh is entirely redefining modern ethnic elegance in her latest breathtaking photoshoot. Wrapped effortlessly…
The trailer for Shaque: Trust No One is out now. Reported to be a psychological…