Telugu

కొడాలి కోటలో టీడీపీ పాగా..

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బరిలో టీడీపీ అమీతుమీ తేల్చుకోవాల్సింది వైసీపీతోనే అయినా ఖచ్చితంగా ఇద్దరికి మాత్రం గెలుపుతోనే సమాధానం చెప్పాల్సిన పరిస్ధితి ఉంది. ఆ ఇద్దరిలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే మరొకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

కొడాలి, వంశీ లు కలసి చంద్రబాబు, లోకేష్ లను ఏవిధంగా టార్గెట్ చేశారో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి తెలిసిందే. రాజకీయ విమర్శలు మానేసి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడం, రాజకీయాలతో అస్సలు సంబంధం లేని బాబు కుటుంబసభ్యులపై కూడా విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అటు టీడీపీ శ్రేణులకే కాక, పార్టీలకు అతీతంగా అందరికి ఆగ్రహం తెప్పించిన పరిస్థితి.

ADVERTISEMENT

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో జగన్ అండ తో కొడాలి, వంశీలు టీడీపీ నాయకులపై ఓ స్థాయిలో రెచ్చిపోతున్నారు. దీంతో విమర్శలకు ప్రతివిమర్శలు చేయడం కాకుండా, కంచుకోట అని చెప్పుకుని చలామణి అవుతున్న నియోజకవర్గాల్లో వారిని చిత్తుచిత్తుగా ఓడించి గట్టి గుణపాఠం చెప్పాలని బాబు ఆలోచిస్తున్నారట. దీని కోసం బాబు ఓ మాస్టర్ ప్లాన్ ని కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కొడాలి కంచుకోటలో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

సుదీర్ఘ కసరత్తు తర్వాత బాబు గుడివాడ టీడీపీ అభ్యర్థిని దాదాపు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు తారకరత్న దురదృష్టవశాత్తు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆ తర్వాత మరణించడం జరిగింది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే తారకరత్న చంద్రబాబుతో తన మనసులోని మాట చెప్పారట. బాబు అనుమతిస్తే కొడాలి నాని పై పోటీ చేసి, విజయం సాధించి, తద్వారా తన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోడాలిపై బదులుతీర్చుకోవాలని ఉందని తారకరత్న బాబు కి చెప్పారట.

తారకరత్న మరణించిన తరువాత ఆయన కుటుంబానికి బాబు, బాలయ్య ఏవిధంగా అండగా నిలిచారో యావత్ తెలుగు ప్రజలందరూ వీక్షించారు. తారకరత్న అంతిమసంస్కారాల విషయంలో కూడా బాలయ్యనే కుటుంబ పెద్దగా అన్నీ తానై అండగా నిలిచారు. తారకరత్న పెద్ద ఖర్మ సమయంలో తారకరత్న మాటలు బాబు గుర్తుచేసుకున్నారట, ఆ విషయాన్ని బాలయ్యతో పంచుకున్నారట.

తారకరత్న చివరి కోరిక నెరవేరాలంటే గుడివాడ బరిలో తారకరత్న సతీమణి ఆలేఖ్య రెడ్డిని నిలబడితే బాగుంటుందని బాలయ్య కూడా తన ఆలోచనని బాబుతో పంచుకున్నారట. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడివాడ నుండి టీడీపీ టికెట్ చాలా మంది ఆశిస్తున్నప్పటికి, ఆలేఖ్య రెడ్డిని బరిలోకి దించితే కోడాలికి ఖచ్చితంగా చెక్ పెట్టొచ్చని బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇదే జరిగితే కొడాలిని ఢీ కొట్టడానికి నందమూరి కుటుంబ సభ్యులనే బరిలోకి దించినట్లవుతుందని బాబు భావిస్తున్నారట. తద్వారా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నుండి బలమైన అభ్యర్థిగా ఆలేఖ్య రెడ్డి నిలుస్తుందని బాబు ఓ గట్టి నిర్ణయానికి వచ్చారని సమాచారం.

ఇదే జరిగితే ఎప్పటి నుండో అవకాశం కోసం చూస్తున్న గుడివాడ తెలుగు తమ్ముళ్ళకు కొండంత బలం వస్తుందనేది విశ్లేషకుల మాట. అన్నింటికి మించి ప్రస్తుతం బాబుకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆలేఖ్య రెడ్డికి మద్దత్తుగా నిలుస్తారని,ఆమె గెలుపు కోసం ప్రచారం కూడా గట్టిగానే చేస్తారని తెలుస్తుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో బాబు చేస్తారని సమాచారం.

చంద్రబాబు, బాలయ్య, పవన్ కళ్యాణ్ లు ముగ్గురు బలపరచిన టీడీపీ బలమైన అభ్యర్థిగా ఆలేఖ్య రెడ్డి గుడివాడ బరిలో నిలవడం, గెలవడం ఖాయం అనే చర్చ సర్వత్రా జరుగుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Child Safety Cannot Come Second to Internet Freedom

The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…

37 minutes ago

జూలకంటి: జగన్ “పాన్ ఇండియా రౌడీయిజం”…

ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…

47 minutes ago