
తెలంగాణలో టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. కానీ రేవంత్ రెడ్డి, కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలతో శతృత్వం ఉన్నవారు కాంగ్రెస్‌లోకి వెళ్లలేకపోతున్నారు.
తెలంగాణలో బీజేపి ఆగమ్య గోచరంగా ముందుకు సాగుతునందున దానిలోకి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో చాలా మంది బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కనుక టీడీపీని మళ్ళీ యాక్టివ్‌గా చేసేందుకు ఇదే తగిన సమయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో టీడీపీ నుంచి ఆ పార్టీలోకి చాలా మంది సీనియర్ నేతలు వెళ్ళారు. వారిలో ముగ్గురు సీనియర్ నేతలు టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు కూడా. కనుక త్వరలోనే వారిలో ఒకరికి టి-టీడీపీ పగ్గాలు అప్పగించి, పార్టీకి మంచి పట్టున్న ఖమ్మం లేదా హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కనుక వాటిలో పోటీ చేసేందుకు వీలుగా టి-టీడీపీ ప్రణాళికలు ఉండబోతున్నాయని సమాచారం.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడింది కనుకనే టీడీపీని యాక్టివ్‌గా చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నప్పటికీ, టీడీపీ యాక్టివ్ అయితేనే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలపడే అవకాశం కూడా పెరుగుతుంది.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేటికీ చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పనిచేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంది. ఒకవేళ తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే ప్రజలకు దానిని బూచిగా చూపించి సెంటిమెంట్ రగిలించి బలపడేందుకు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపి, టీడీపీ మూడూ అవసరం లేదని బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అని గట్టిగా వాదించడం మొదలుపెడుతుంది.
ఒకవేళ తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేసి బలోపేతం చేసుకున్నా ఆ రాష్ట్రంలో అది మళ్ళీ పుంజుకుంటుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ యాక్టివ్‌గా ఉంటే తప్పకుండా ఓట్లు చీల్చగలదు.
కనుక కాంగ్రెస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీలకు దాని వలన ఎంతో కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఆ మూడు పార్టీలు తెలంగాణలో టీడీపీని అడ్డుకునేందుకు ప్రయత్నించక మానవు.
తెలంగాణ రాజకీయాలను ఔపొసన పట్టిన చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ తెలియవనుకోలేము. కానీ ఆయన మనసులో నిర్ధిష్టమైన ఆలోచన ఏదో ఉండే ఉంటుంది కనుకనే అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారేమో?
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…