Telugu

అర్ధరాత్రి గోడదూకి… ఇంట్లో ప్రవేశించి… అయ్యన్న అరెస్ట్!

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులు విజయ్, రాజేష్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఇంటిగోడ కూల్చివేతకు సంబందించి వారు నకిలీ ధృవపత్రాలు సమర్పించారని అభియోగంతో పోలీసులు వారికి నాన్-బెయిలబుల్ వారెంట్‌ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈరోజు ఏలూరు కోర్టులో వారిని హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక ప్రజలు, టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకొనేలోగానే పోలీసులు వారు ముగ్గురినీ జీపులో తీసుకువెళ్లిపోయారు.

ఈ ఘటనపై అయ్యన్న పాత్రుడి అర్ధాంగి పద్మావతి విలేఖరులతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యాలు భరించలేనంతగా పెరిగిపోయాయి. రాత్రి 2 గంటలకు సుమారు 200 మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి గోడలు దూకి దౌర్జన్యంగా మా ఇంట్లోకి ప్రవేశించారు. ఇలా అర్ధరాత్రి గోడ దూకి మా ఇంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఏముంది? అడిగితే నేనే తలుపు తీసి లోనికి రానిచ్చేదానిని కదా.. అని నేను వారిని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.

ADVERTISEMENT

వారిలో కొందరు తాగి ఉన్నారు. అదే నేను అడిగితే మేమేమీ తాగలేదు కావాలంటే చూస్కో అంటూ నా మొహం మీద నోటితో గాలి ఊదారు. గత మూడున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఏదోవిదంగా వేధిస్తూనే ఉంది. మేమేమైన గంజాయి అమ్ముతున్నామా లేక ఉగ్రవాదులమా? ఇలా అర్ధరాత్రి మా ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి ఇంట్లో ప్రవేశించి పట్టుకోవడానికి.

కనీసం మావారిని చెప్పులు కూడా వేసుకోనీయకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయారు. ముందు కారులో తీసుకువెళతామన్నారు కానీ జీపులో కూర్చోబెట్టి తీసుకుపోయారు. నా ఇద్దరు కొడుకులని, ఆయనని వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారో, ఏం చేయబోతున్నారో తెలియదు. కానీ వారికి ఏ హాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను ఇంత దిగజార్చేస్తారని అనుకోలేదు. ఆయనకి మరీ ఇంత పైశాచిక ఆనందం అవసరమా?” అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు చింతకాయల పద్మావతి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rohit’s 2027 WC Spot: Cricket Legend Warns BCCI

Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…

25 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

55 minutes ago