
నర దిష్టికి రాళ్ళు కూడా పగులుతాయి అనే సామెత మాదిరే కన్నీటి ఉసురుకి కోటలు కూడా బద్దలవుతాయి అనేలా టీడీపీ కన్నీటికి ఇటు ఏపీలో వైసీపీ అటు తెలంగాణలో బిఆర్ఎస్ కోటలు విచ్ఛిన్నమవుతున్నాయి.
మామ కు వెన్నుపోటు అంటూ దశాబ్దాల నుంచి చంద్రబాబు నాయుడి మీద రాజకీయాలు నడిపిన నాయకులు, పార్టీలు ఇప్పుడూ గొడ్డలిపోటు, ఉరితాళ్లు అంటూ సొంత రక్త సంబంధీకుల నుంచే విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాజకీయంగానూ ఎదురీత చేస్తున్నారు.
రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ ని పూర్తిగా సమాధి చేయడానికి బిఆర్ఎస్ వేయని ప్రణాళిక లేదు, చేయని అరాచకం లేదు. ఆంధ్రోళ్ల నాయకత్వం మనకు అవసరమా.? అంటూ తెలంగాణలో పురుడు పోసుకున్న టీడీపీ పునాదులు కదిపారు. టీడీపీ తో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి అదే టీడీపీ లో నాయకుడిగా ఎదిగి, సొంత పార్టీ పెట్టుకుని,
టీడీపీ తో పొత్తులకు ఒప్పుకుని చివరికి అదే టీడీపీ ని పార్టీ అధినేత ఆమోదం ముద్ర లేకుండానే పార్టీ నాయకులను నయానో భయానో తనదారికి తెప్పించుకుని టి.టీడీపీ ని తెరాసలో విలీనం చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణలో టీడీపీ లేదు, ఇక రాదు అనే విధంగా పసుపు జెండా రెక్కలు విరిచారు కేసీఆర్.
గులాబీ కారుతో పసుపు సైకిల్ నామరూపాలు మాయం చెయ్యాలని చూసిన కేసీఆర్ విధ్వంసానికి అనేకమంది తెలంగాణ టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు నిస్సహాయులుగా మిగిలి వారి ఆవేదనను మౌన రోదనగా మార్చుకున్నారు. వారందరి కన్నీటి ఉసురే నేడు బిఆర్ఎస్ కు కవిత రూపంలో రిటర్న్ గిఫ్ట్ మాదిరి తిరిగొచ్చింది.
ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.., వచ్చిన ఒక్క ఛాన్స్ టీడీపీ పతనానికే, బాబు అంతానికే అన్నట్టుగా గత వైసీపీ అటు టీడీపీ పార్టీ పై ఇటు పార్టీ అధినేత బాబు పై మానసికంగా, రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు కొట్టాలో అన్ని దెబ్బలు కొట్టేసారు. పార్టీ కార్యాలయాల మీద దాడుల నుంచి బాబు ప్రయాణించే బస్సు పై రాళ్ల దాడుల వరకు వైసీపీ విధ్వంశం కొనసాగింది.
అలాగే పార్టీ ముఖ్యనాయకుల నుంచి పార్టీ అధినేత వరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరు జైలు జీవితం రుచి చూసిన వారే. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని చీకటి రోజులను, ఎప్పుడు ఎదురవ్వని వ్యక్తిగత దాడులను చంద్రబాబు గత ఐదేళ్లల్లో చూసేసారు.
బాబు అరెస్టు తో టీడీపీ ని ఏపీలో కూడా పుర్తిగా భూస్థాపితం చెయ్యాలన్న వైసీపీ ఆలోచనకు ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆనాటి టీడీపీ కన్నీటి ఉసురే ఈనాడు వైసీపీ దుస్థితి. బాబు అరెస్టు తో టీడీపీ ని చావు దెబ్బ కొట్టాం అనుకున్న వైసీపీ కి చెల్లి షర్మిల రూపంలో కర్మ ఫలం ఎదురయ్యింది.
ఇలా టీడీపీ ని రాజకీయంగా పతనం చెయ్యడానికి, మానసికంగా కుంగదీయడానికి ఒక్కటైనా వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు ఇప్పుడూ రెండు ఒకేసారి పాతాళానికి పడ్డాయి. ఒకరు చెల్లితో పోరాడుతుంటే మరొకరు కూతురు పై కత్తి కట్టారు. బిఆర్ఎస్ ఉనికి కోసం అల్లాడుతుంటే వైసీపీ పట్టు నిలుపుకోవడానికి తాపత్రయ పడుతుంది.
అయితే ఇక్కడ జగన్, కేసీఆర్ ఇద్దరి లక్ష్యం టీడీపీ పతనమే అన్నట్టుగా సాగితే ఈ రెండు పార్టీల అంతమే మా పంతం అన్నట్టుగా టీడీపీ సేన ముందడుగేసింది. ఒక్క వ్యక్తి అరెస్టు, లక్షలాదిమంది కన్నీటి ఉసురు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేడంతో పాటు వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల అధికార కోటలు బద్దలు కొట్టింది. ఆయ పార్టీల భవిష్యత్ ని తలకిందులు చేసింది.
YS Jagan has active ED and CBI cases filed against him which mandates him to…
“మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ మనమే” అని వైసీపీ శ్రేణులకు వారి అధినేత జగన్ భరోసా ఇస్తున్నారు. కానీ…